Connect with us

Conference

Atlanta: సెప్టెంబర్ లో ఘనంగా ఆప్తా నేషనల్ కాన్ఫరెన్స్; ఉదయ భాస్కర్ కొట్టే, అధ్యక్షులు

Published

on

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ (American Progressive Telugu Association – APTA) ఏర్పాటుచేసి 15 వసంతాలు పూర్తయిన సంగతి అందరికీ విదితమే. ఈ సందర్భంగా ఆప్తా నేషనల్ కాన్ఫరెన్స్ ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆప్తా అధ్యక్షులు, అట్లాంటా వాసి ఉదయ భాస్కర్ కొట్టే తెలిపారు.

ఆప్తా (APTA) నూతన కార్యవర్గం ఈ వారాంతం అట్లాంటాలో సమావేశమై 2023-2024 రోడ్ మ్యాప్ పై చర్చించిందన్నారు. ఈ సందర్భంగా అట్లాంటాలో పలు వేదికలను కాన్ఫరెన్స్ కొరకు నిర్వాహకులు పరిశీలించారు. లేబర్ డే ని పురస్కరించుకొని సెప్టెంబర్ లాంగ్ వీకెండ్ లో ఆప్తా నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) నిర్వహిస్తామన్నారు.

అట్లాంటా (Atlanta) లో ఆప్తా నిర్వహించే ఈ కాన్ఫరెన్స్ కి తెలుగు రాష్ట్రాల నుండి మెగాస్టార్ చిరంజీవి (Konidala Siva Sankara Vara Prasad), పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ, సాహిత్య కళాకారులను ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు. పక్కా ప్రణాళికతో ఆప్తా చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు.

ఆప్తా కార్యవర్గ సమావేశంలో బోర్డు చైర్ సుబ్బు కోట (Subbu Kota), ఆప్తా పూర్వ అధ్యక్షులు, ఇతర బోర్డు సభ్యులు, కార్యవర్గ సభ్యులు, అట్లాంటా ఆప్తా ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా ప్రముఖ నగరాలైన వాషింగ్టన్ డీసీ, డల్లాస్, మేరీల్యాండ్ నుండి పలువురు ఆప్తా నాయకులు కూడా విచ్చేశారు.

అనంతరం జాన్స్ క్రీక్ లోని సంక్రాంతి బ్యాంక్వెట్ హాల్లో ఫండ్రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాతలు హాఫ్ మిలియన్ డాలర్స్ విరాళాలను ప్రకటించడం విశేషం. దీంతో ఆప్తా (APTA) నేషనల్ కాన్ఫరెన్స్ కి మంచి ఊపు వచ్చింది. పెద్దలు, మహిళలు, పిల్లలు అందరూ ఆహ్లాదంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected