Connect with us

Charity

TANA @ Pennsylvania: ఆకలితో ఉన్న కుటుంబాలకు యువత ఆహార భరోసా.. 1,800 పౌండ్ల ఆహార విరాళం

Published

on

Mechanicsburg, Pennsylvania: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ (TANA Mid-Atlantic Chapter) యూత్ వాలంటీర్లు అక్టోబర్ 25న పెన్సిల్వేనియాలోని మెకానిక్స్ బర్గ్‌లో 2026 ప్రాంతీయ ఫుడ్ డ్రైవ్‌ను విజయవంతంగా ప్రారంభించారు. అవసరంలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడానికి దాదాపు 1,800 పౌండ్ల ఆహార పదార్ధాలను సేకరించి, వాటిని గ్రేస్ హౌస్ మినిస్ట్రీస్ కు విరాళంగా అందించారు.

సోహన్ సింగు నేతృత్వంలోని మెకానిక్స్ బర్గ్ చాప్టర్ బృందం, సతీష్ చుండూరు, శ్రీనివాస్ కోట, రాజు గుండాల, వెంకట్ సుబ్బారావు ముప్పా, శ్రీనివాస్ అబ్బూరి, వెంకట్ నెల్లూరు, కృష్ణ పుట్లూరి, లక్ష్మణ్ బెల్లం, వంశీ ముప్పాళ్ల, సునీల్ పొందూరి, వేణు మక్కెన, నవీన్ తోకల మరియు రాకేష్ పైడి వంటి అంకితభావం గల వలంటీర్లతో (Volunteers) కలిసి పనిచేసింది.

విరాళాలు సేకరించడంలో, ఆహారాన్ని సేకరించడంలో ‘జవేంజర్స’ బృందం కూడా ముఖ్యమైన పాత్ర పోషించి, ఈ ప్రారంభ కార్యక్రమం విజయవంతానికి సహకారాన్ని అందజేసింది. తానా కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni) ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరై, సామాజిక సేవ పట్ల తమ అంకితభావాన్ని కొనసాగించాలని యువ వాలంటీర్లను ప్రోత్సహించారు.

తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు (Venkat Singu), తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ (Regional Representative) ఫణి కంతేటి, రామ్ తాడిశెట్టి మరియు చాప్టర్ ఛైర్ సోహన్ సింగు యువ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు.

వారి అంకితభావాన్ని ప్రశంసిస్తూ, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషిని నిరంతరం కొనసాగించాలని కోరారు. పాల్గొన్నవారి సేవలకు (Service) గుర్తింపుగా వాలంటీర్ సర్వీస్-అవర్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.

తానా బోర్డ్ సభ్యుడు రవి పొట్లూరి (Ravi Potluri) ఫుడ్ డ్రైవ్ లో పాల్గొన్నవారికి అభినందనలు తెలియజేస్తూ, సామాజిక సేవ పట్ల నిరంతర అంకితభావంతో పనిచేస్తున్న మిడ్ అట్లాంటిక్ తానా నాయకత్వానికి (Leadership) మరియు యూత్ వాలంటీర్లకు ఈ సేవలను నిరంతరం కొనసాగించేందుకు కృషి చేయాలని సూచించారు.

ఇలాంటి కార్యక్రమాలకు (Programs) నిరంతరం ప్రోత్సాహం, మద్దతు అందిస్తున్న తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి (Dr. Naren Kodali), తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి (Phani Kantheti) మరియు తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగులకు తానా మిడ్-అట్లాంటిక్ వలంటీర్లు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

నవంబర్ 30 వరకు కొనసాగనున్న ఫుడ్ డ్రైవ్

తానా మిడ్-అట్లాంటిక్ ఫుడ్ డ్రైవ్ (Food Drive) నవంబర్ 30, 2026 వరకు కొనసాగుతుంది. ఈ రీజియన్ వ్యాప్తంగా ఉన్న మరో 18 చాప్టర్లలో ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నిర్వాహకులు (Organizers) పేర్కొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected