అమెరికా, జర్మనీ తోపాటు పలు దేశాల్లోని బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విజయవాడకు (Vijayawada, Andhra Pradesh) చెందిన కార్పెంటర్ శైలేంద్ర శర్మకు నందమూరి ఫాన్స్.కామ్ తరుపున రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు.
విజయవాడలో అతడ్ని కలిసి నగదు చెక్కును నందమూరి ఫాన్స్.కామ్ ప్రతినిధులు అందజేశారు. నందమూరి అభిమానుల (Nandamuri Fans) సాయానికి శైలేంద్ర శర్మ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వారి ఆర్థిక సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని భావోద్వేగానికి గురయ్యారు.
నందమూరి అభిమానుల ఔదార్యాన్ని వైద్యులు అభినందించారు. ప్రజలకి కష్టం వచ్చినప్పుడు, విపత్కర సమయాల్లో బాలయ్య (Nandamuri Balakrishna) అభిమానులు తాము ఎప్పుడూ ముందుంటామని నందమూరి ఫాన్స్.కామ్ (NandamuriFans.com) ప్రతినిధులు తెలిపారు. సోషల్ మీడియా (Social Media) ద్వారా శైలేంద్ర శర్మ మమ్మల్ని అభ్యర్థించారు. తన అనారోగ్య సమస్యల్ని వివరించి సాయం కోరారు.
దీంతో సత్వరం స్పందించి సాయం చేశాం. వైద్యులతో మాట్లాడి అన్ని రకాలుగా సాయం అందించాలని కోరాం. అభిమానులంటే సినిమాలు విడుదలైనప్పుడు హడావిడి చేయటం, సోషల్ మీడియాలో యుద్ధాలు చేయడమే కాదు, ఇలా బాధితులకు అండగా నిలవడం… అని వారు తెలిపారు. వివేక్, పవన్ చౌదరి, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.