హాంగ్‌కాంగ్ (Hong Kong) తెలుగు సమాఖ్య (THKTS) ఆడపడుచులు తెలంగాణ బతుకమ్మ పండుగను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. అందమైన ద్వీపమైన హాంగ్‌కాంగ్‌లో తెలుగు కుటుంబాలు చాలా తక్కువ, వారిలో అధికశాతం వలసవాసులే. అయినప్పటికీ, మన పండుగలను, సంప్రదాయాలను పాటించడంలో వారి ఉత్సాహం ఎప్పటికీ తగ్గదు.
తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను నిర్వహించడం ఈ సమాఖ్యకు ఒక అందమైన సంప్రదాయంగా మారింది. తెలంగాణ, ఆంధ్ర (Andhra) ప్రాంతాల ఆడపడుచులు అలంకారభూషితంగా సింగారించి, విభిన్న రకాల బతుకమ్మలను తయారు చేసి, తుంగ్‌చుంగ్ ప్రామినాడ్ వద్ద పాటలు పాడుతూ బతుకమ్మను సాగనంపారు.
ఈ బతుకమ్మ వేడుకలో వారి ఆనందం, ఉత్సాహం ప్రత్యేకంగా ప్రతిఫలించింది. పాఠశాల సెలవుల (School Holidays) కారణంగా అనేక కుటుంబాలు హాంకాంగ్‌ను (Hong Kong) విడిచి ప్రయాణాలకు వెళ్లినప్పటికీ, పాల్గొన్నవారి ఉత్సాహం తగ్గలేదు.
ఈ సంవత్సరం వేడుకలో ప్రత్యేకత ఏమిటంటే—హాంగ్‌కాంగ్ కి తమ పిల్లల వద్దకు వచ్చిన తల్లిదండ్రులను, వారు ఇక్కడ తక్కువ కాలం మాత్రమే ఉన్నప్పటికీ, సంతోషంగా ఉంచేందుకు సమాఖ్య (Hong Kong Telugu Samakhya) వ్యవస్థాపకురాలు (Founder) ప్రారంభించిన “జాలీ గుడ్ మైత్రీవనం” కోసం ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.
ఈ గ్రూప్ ద్వారా ఆమె శ్రేయస్సు, వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిని చురుకుగా అనుసంధానిస్తున్నారు. “జాలీ గుడ్ మైత్రీవనం”లోని పెద్దలు (Senior Citizens) కూడా ఆసక్తిగా పాల్గొన్నారు. భారతదేశం (India) లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు బతుకమ్మ పండుగలో పాల్గొని, దాని ఆచారాలు, సంప్రదాయాలను తెలుసుకున్నారు.
ఈ పండుగలోని సాంస్కృతిక వైభవం వారిని ఆకట్టుకుంది. హాంకాంగ్‌లో (Hong Kong) బతుకమ్మ (Bahtukamma) పండుగను ఈ విధంగా జరుపుకోవడం భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ (International) స్థాయిలో పరిచయం చేసే అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది.