Baltimore, Maryland: తానా 50వ వార్షికోత్సవం–గోల్డెన్ జూబ్లీ సందర్భంగా చేపట్టిన “Giving Back to the Community” కార్యక్రమంలో భాగంగా తానా క్యాపిటల్ రీజియన్ బృందం బాల్టిమోర్ కౌంటీ పబ్లిక్ స్కూల్స్ విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్‌లు, పాఠశాల సామగ్రిని అందజేసింది.
సెప్టెంబర్ 17, 2026న మేరీల్యాండ్‌లోని (Windsor Mill, Maryland) విండ్సర్ మిల్‌లో ఉన్న The Exchangeree – Education Foundation of Baltimore County Public Schools వద్ద ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించడం ద్వారా కొత్త విద్యా సంవత్సరాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించేందుకు తమ వంతు సహకారం అందించారు.
ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షులు డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali), తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనిల్ ఉప్పలపాటి (Anil Choudary Uppalapati), కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, తానా క్యాపిటల్ ఏరియా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ కొమ్మి, తానా బాల్టిమోర్ సిటీ కోఆర్డినేటర్ ఉమాకాంత్ రఘుపతి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా తానా (Telugu Association of North America – TANA) ప్రతినిధులు BCPS Education Foundation ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. హీథర్ వూల్‌రిడ్జ్‌ను కలిసి, బాల్టిమోర్ ప్రాంత విద్యార్థుల కోసం బ్యాక్‌ప్యాక్‌లు, పాఠశాల సామగ్రిని అధికారికంగా అందజేశారు.
“సమాజానికి తిరిగి ఇవ్వడం.. పిల్లల భవిష్యత్తుకు అండగా నిలవడం” అనే స్ఫూర్తితో తానా (TANA) చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్య, పిల్లల సంక్షేమం, సమాజ సేవకు తానా ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
తానా (TANA) 50వ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన ఈ Golden Jubilee – Giving Back to the Community కార్యక్రమం ద్వారా అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో అవసరమైన విద్యార్థులు, కుటుంబాలకు సహాయం అందించేందుకు తానా తన సేవా కార్యక్రమాలను విస్తరిస్తోంది.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లు, తానా (TANA) సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల విద్యాభివృద్ధికి, వారి భవిష్యత్తుకు చిన్న సహాయం కూడా ఎంతో విలువైనదని పేర్కొంటూ.. “కలిసికట్టుగా మన పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురాదాం.. సమాజానికి తిరిగి ఇద్దాం” అనే సందేశాన్ని అందించారు.