Aurora, Cleveland, Ohio, September 11, 2026: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఒహాయో వ్యాలీ బృందం “గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ” స్ఫూర్తితో నిర్వహించిన బ్యాక్‌ప్యాక్ కార్యక్రమం విజయవంతమైంది. అరోరా సిటీ కోఆర్డినేటర్ రామారావు పంగులూరి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రీజినల్ రిప్రజెంటేటివ్ ప్రదీప్ చందనం (Pradeep Chandanam) స్వయంగా పాల్గొని బ్యాక్‌ప్యాక్‌లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మి యార్లగడ్డ, నరేష్ బొడ్డు, సుహాసిని అడ్డగడ, సాయి రెడ్డి టేకుర్తి పాల్గొని బ్యాక్‌ప్యాక్‌ల పంపిణీకి సహకరించారు. విద్యార్థుల కోసం సేకరించిన బ్యాక్‌ప్యాక్‌లను అరోరా (Aurora, Ohio) పాఠశాలల ప్రతినిధులకు అందజేశారు.
స్థానిక విద్యార్థుల విద్యా ప్రయాణానికి సహకరించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా (TANA) ప్రతినిధులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, స్థానిక నాయకులు మరియు పాఠశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సహకారాన్ని అరోరా పాఠశాలల నాయకత్వ బృందం అభినందించింది.
ఈ సేవా కార్యక్రమానికి మార్గదర్శకత్వం అందించిన తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, రీజినల్ రిప్రజెంటేటివ్ ప్రదీప్ చందనం (Pradeep Chandanam), స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ చావా (Siva Chava), కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni), ఒహాయో వ్యాలీ బ్యాక్‌ప్యాక్ కో-చైర్ సతీష్ దంతులూరి, తానా బ్యాక్‌ప్యాక్ చైర్ నరేష్ బొడ్డులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే, కార్యక్రమ విజయానికి సహకరించిన తానా టీమ్ స్క్వేర్ ఒహాయో కో-చైర్ సుహాసిని అడ్డగడ, ఒహాయో వ్యాలీ (Ohio Valley) బాలోత్సవం కో-చైర్ ప్రియాంక యడ్లపల్లి, ఒహాయో వ్యాలీ కళాశాల కో-చైర్ లక్ష్మి యార్లగడ్డలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
బ్యాక్‌ప్యాక్‌ల సేకరణ, ప్యాకింగ్, రవాణా మరియు పంపిణీలో సహకరించిన వాలంటీర్లు, స్పాన్సర్లు, అరోరా (Aurora, Ohio) పాఠశాలల నాయకత్వ బృందం, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు సమాజ సభ్యులందరికీ తానా (Telugu Association of North America – TANA) ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.