ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఆటా (ATA) మహాసభలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా బాల్టిమోర్, మేరీల్యాండ్‌లో (Maryland, Baltimore) జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
అమెరికా (United States) నలుమూలల నుంచి వేలాది మంది తెలుగు ప్రజలు, ఇండియా (India) నుంచి ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వైద్యులు, యువత, కళాకారులు ఒకే వేదికపై కలుసుకుని తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, సేవా భావాన్ని చాటిచెప్పారు.
మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs), వ్యాపార సదస్సులు (Business Sessions), వైద్య, విద్య, సాంకేతిక, యువజన, మహిళా సాధికారత (Women Empowerment), సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేష ఆదరణ పొందాయి.
తెలుగు వారసత్వాన్ని భావితరాలకు చేరవేసేలా రూపొందించిన ప్రతి కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినీ, సంగీత, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖుల ప్రదర్శనలు, సంగీత విభావరి, నృత్య ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలు సభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
యువత కోసం నిర్వహించిన ప్రత్యేక సెషన్లు, కెరీర్ మార్గదర్శక కార్యక్రమాలు, నాయకత్వ శిక్షణలు, నెట్‌వర్కింగ్ అవకాశాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చాయి. ఈ బ్రేకౌట్ సెషన్స్ అన్నిటికీ హాజరవుతూ ఆహ్వానితులు బిజీ బిజీగా గడిపారు.
వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన బిజినెస్ ఫోరమ్‌లు, B2B సమావేశాలు, సాంకేతిక చర్చలు విశేష స్పందన పొందాయి. అలాగే ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు (AI), ఆవిష్కరణలు, పారిశ్రామికాభివృద్ధిపై నిర్వహించిన చర్చలు పాల్గొన్న వారికి విలువైన అవగాహన కల్పించాయి.
ప్రదర్శన విభాగంలో ఏర్పాటు చేసిన వందలాది ఎగ్జిబిషన్ బూత్‌లు (Shopping Stalls), వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, సేవా సంస్థలు, రియల్ ఎస్టేట్, ఆరోగ్య, ఆర్థిక రంగాలకు చెందిన ప్రతినిధులు సందర్శకులను ఆకర్షించాయి. కుటుంబ సమేతంగా విచ్చేసిన వారు షాపింగ్‌తో పాటు వివిధ సేవల గురించి తెలుసుకునే అవకాశం పొందారు.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా (Jayanth Challa) మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే కుటుంబంగా కలిపే వేదికగా ఆటా నిలుస్తోందని, ఈ మహాసభల విజయానికి అహర్నిశలు శ్రమించిన వందలాది మంది వాలంటీర్లు, కమిటీ సభ్యులు, దాతలు, స్పాన్సర్లు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బనాల (Sridhar Banala) మాట్లాడుతూ… ప్రతి కార్యక్రమాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించేందుకు అన్ని కమిటీలు సమన్వయంతో పనిచేశాయని, ఈ మహాసభలు తెలుగు సంఘ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ఆటా ఉపాధ్యక్షులు సతీష్ రెడ్డి (Satish Reddy Ramasahayam) మాట్లాడుతూ… ఆటా ఆశయాలను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆటా (ATA) సేవాకార్యక్రమాలలో అందరూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సేవా కార్యక్రమాలు, యువత సాధికారత, వ్యాపారాభివృద్ధి, సామాజిక బాధ్యత—ఈ ఆరు అంశాలను సమన్వయం చేస్తూ నిర్వహించిన ఆటా 19వ కాన్ఫరెన్స్ (Convention) ప్రపంచ తెలుగు సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలిచి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించింది.
విద్య, వ్యాపార, ఆరోగ్య, సామజిక సేవ వంటి వివిధ రంగాలలో సేవలందించిన ప్రముఖులకు అవార్డ్స్ (Awards) ప్రధానం చేశారు. అలాగే దాతలను, గత ఆటా (American Telugu Association) అధ్యక్షులను వేదికపై ఘనంగా సన్మానించారు.
యువత కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యూత్ కన్వెన్షన్ (Youth Convention) లో యువతీయువకులు ఆహ్లాదంగా గడిపారు. శ్రీ శివ పార్వతుల కల్యాణంతో ఆహ్వానితులు అందరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అందరూ ప్రసాదం అందుకున్నారు.
ప్రతి రోజూ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ (Live Musical Show – ఆరంజ్ స్ట్రీట్, త్రీరీ బ్యాండ్, కీరవాణి) తో ఆటా 19వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్మరణీయ జ్ఞాపకాలను నింపిన ఈ మహాసభలు ఆటా చరిత్రలో మరో స్వర్ణాధ్యాయంగా నిలిచాయి.
19వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కి సంబంధించి మరిన్ని ఫోటోల కొరకు క్రింది NRI2NRI.COM లింక్స్ ని సందర్శించండి.
Banquet Day: www.NRI2NRI.com/ATA Convention in Baltimore Maryland Banquet Day
Convention Day 2: www.NRI2NRI.com/ATA Convention in Baltimore Maryland Day 2
Convention Day 3: www.NRI2NRI.com/ATA Convention in Baltimore Maryland Day 3