Connect with us

Politics

అట్లాంటాలో YSRCP NRI Wing Website ప్రారంభం, పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలని పిలుపు

Published

on

Cumming, Georgia: అమెరికా పర్యటనలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) జనరల్ సెక్రటరీ & గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివ రెడ్డి గారికి జార్జియా రాష్ట్రంలోని కమింగ్ నగరంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాంటా (Atlanta) టీమ్ ఘన స్వాగతం పలికింది.

ముందుగా సభలో మహానేత కీ.,శే. డా. వైఎస్ రాజశేఖర రెడ్డి (Yeduguri Sandinti Rajasekhara Reddy) గారిని స్మరించడంతో పాటు, ఇటీవల పరమపదించిన కాపునేత కీ.,శే శ్రీ ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) గారికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆలూరు సాంబశివ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు మరియు పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గారితో తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు (NRIs) పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ అధికారిక వెబ్‌సైట్
www.ysrcpnriwing.org ను ఆలూరు సాంబశివ రెడ్డి (Sambasiva Reddy Aluru) గారు
ఘనంగా ప్రారంభించారు.

ఈ వేదిక ద్వారా
. పార్టీ అప్‌డేట్లు
. స్టూడెంట్ మెంటరింగ్
. కెరీర్ గైడెన్స్
. ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్
. వాలంటీర్ అవకాశాలు
. కమ్యూనిటీ సేవా కార్యక్రమాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలకు (Telugu NRIs) అందుబాటులో ఉంటాయని తెలిపారు. చివరిగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) గ్లోబల్ ఎన్ఆర్ఐ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసే అంశాలపై ఇంటరాక్టివ్ చర్చ నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని వెంకట రామిరెడ్డి చింతం, శ్రీనివాసులు రెడ్డి కొట్లూరి (Srinivasa Reddy Kotlure), రాంభూపాల్ రెడ్డి పంగా, నంద గోపీనాథ్ రెడ్డి (గోపి), రవి బొరెడ్డి, చైతన్య రెడ్డి చెర్లపల్లి, రాఘవేంద్ర రెడ్డి చెన్నూరు, వెంకట్ పబ్బులేటి, లక్ష్మీ నారాయణ (గ్లెన్), రంగేష్ కోనా, ఆదిత్య, రఘువీర రెడ్డి సాగిలి తదితరులు సమన్వయం చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected