ఫ్యాషన్ షో (Fashion Show) లు ఆడువారికి మాత్రమే పరిమితం కాదు, మగవారు కూడా చెయ్య వచ్చు, అదికూడా సంప్రదాయ సిద్దమైన చేనేత పంచెలతో అని నిరూపించారు న్యూ యార్క్ (New York) తెలుగు పురుషులు.
న్యూ యార్క్ “జవానీస్” నెహ్రూ కఠారు (Nehru Kataru), కిరణ్ రెడ్డి పర్వతాల, ప్రసాద్ డబ్బీరు, హరిశంకర్ రసపుత్ర, కార్తీక్ మన్నెం, సుమంత్ రాంశెట్టి ఆధ్వర్యం లో TLCA (Telugu Literary and Cultural Association) వేదికమీద జరిగిన ఈ ఫాషన్ షో లో దాదాపు 60 మంది కి పైగా మగవారు పాల్గొన్నారు.
ఈ రోజులలో మగవారు పంచెకట్టడం చాలా తగ్గిపోయింది. పెళ్లిళ్లలో, ఫంక్షన్స్ లో పంచె కట్టినా అది నార్త్ ఇండియన్ స్టైల్ మరియు ఇండో-వెస్ట్రన్ స్టైల్ లో మాత్రమే. సిసలైన తెలుగోడి పంచె కట్టు కనుమరుగవుతున్న ఈ తరుణంలో, చేనేత పంచెలతో ఫాషన్ షో చేశారు.
అంతరించి పోతున్న తెలుగు సంప్రదాయాన్ని పరిరక్షించటమే కాకుండా, భావితరాలకు మన సంప్రదాయాన్ని తెలియజెప్పే ప్రయత్నమే ఈ “పంచెకట్టు” కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి, దాతలకు, TLCA ప్రెసిడెంట్ సుమంత్ రాంశెట్టి (Sumanth Ramsetti) గారు, వారి కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
దీనికి సహకరించిన శిరీష తూనుగుంట్ల (Sirisha Tunuguntla) గారికి జవానీస్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ పంచెకట్టు కార్యక్రమ స్పూరితో సంవత్సరానికి ఒక రోజు, మనదైన ఉగాది పండుగ రోజు మగవారందరు పంచె కట్టు కుంటారనే ఆకాంక్ష ని “జవానీస్” తెలియజేసారు.