Connect with us

Associations

సంఘసేవలో వినయ విధేయ రాముడు.. వినయ్ మద్దినేని

Published

on

కొందరు అట్లాంటా వినయ విధేయ రాముడు అంటారు. మరికొందరు అందరివాడు మా వినయుడు అంటారు. ఈ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ అని తేడాలేకుండా సంఘసేవలో ముందుండడం వల్లనేమో తానా లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు వినయ్ మద్దినేని. ప్రస్తుతం తానా కౌన్సిలర్ ఎట్ లార్జ్ గా, 5కే వాక్ కోఆర్డినేటర్ గా, అలాగే 2017 నుంచి 2019 దాకా కో చైర్ గా తెలుగు భాష అభివృద్ధికి బాటలు వేశారు. అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ అధ్యక్షునిగా మరియు చైర్మన్ గా చెరగని ముద్ర వేశారు. అలాగే జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సర్టిఫైడ్ వాలంటీర్ గా తామా ఫ్రీ క్లినిక్ లో సేవలందిస్తున్నారు.

తానా టాక్స్ సెమినార్, సీపీఆర్ ట్రైనింగ్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ సెమినార్ నిర్వహించడంలో స్వచ్చందంగా కీలకపాత్ర పోషించారు. పేదలకు తానా సంస్ధ ద్వారా కుకింగ్ మరియు ఫీడింగ్ హంగ్రీ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రపంచానికి శాంతిని వ్యాపించడంలో ముఖ్యపాత్ర పోషించిన భారత దేశం యోగ వర్క్ షాప్ మరియు హోమ్ఏజ్ టు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం వంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. తానా మరియు తామా భాగస్వామ్యంతో ధీమ్ తానా మరియు బోన్ మారో డ్రైవ్స్ నిర్వహించారు. తామా మరియు సిలికానాంధ్ర భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న తెలుగు మనబడి కార్యక్రమంలో మొదటినుండి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మనఊరి కోసం కార్యక్రమంలో భాగంగా 5కే వాక్ నిర్వహణలో వినయ్ కుమార్ మద్దినేని గారు 400 మందికి పైగా తానా సభ్యులతో విజయవంతగా నిర్వహించారు. 2014 డేర్రోయిట్ కన్వెన్షన్ కార్యక్రమం కోసం విస్తృతంగా నిధులు స్వీకరించడం జరిగింది. మరియు తానా ప్రతి కార్యక్రమంలో 2001 నుండి సపోర్ట్ చేస్తున్నారు.

అట్లాంటాలోని అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో అపార్ట్మెంట్ యాజమాన్యంతో భాగస్వామ్యం అయి అక్కడి వారికి విలువైన వస్తువులు మరియు డాక్యూమెంట్స్ స్వీకరించి భద్రపరచడంలో అసాధారణ పాత్ర వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడంలో భారతదేశ కాన్సులేట్ మరియు ఇతర ప్రాంతీయ సంస్థలతో కలిసి విజయవంతంగా పనిచేశారు. ధర్మో రక్షతి రక్షతః అనే ననుడిని సిరాసవహిస్తూ ధర్మాన్ని సాంస్కృతినీ నలుగురు ఆదర్శంగా తీసుకోవాలనే ముఖ్యఉద్దేశంతో సాయి బాబా మందిరం ఏర్పాటు సమయంలో గుడిని శుభ్రపరిచి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్యపాత్ర వహించారు. తామా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బోన్ మారో డ్రైవ్స్ అనే కార్యక్రమంలో జాతీయ స్థాయి సంస్థలతో కలసి పనిచేయడం జరిగింది. అట్లాంటాలోని ఇండియన్ అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలలో ముఖ్య ఇండియన్ పాత్ర వహించారు.

ఈ సేవలను తానా ద్వారా మరింత విస్తృతంగా చేయాలనే సంకల్పంతో టీం నిరంజన్ గారి ప్యానెల్లో ఫౌండేషన్ ట్రస్టీ గా పోటీ చేస్తున్న అట్లాంటా వినయ విధేయ రాముడు, అందరివాడు అయిన వినయ్ మద్దినేని ని అఖండ మెజార్టీతో గెలిపిద్దాం.

error: NRI2NRI.COM copyright content is protected