Connect with us

Movies

వాయుపుత్ర సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న Atlanta NRI వెంకట్ దుగ్గిరెడ్డి

Published

on

గత కొంత కాలంగా అట్లాంటా (Atlanta) వాసి వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) తెలుగు సినిమాలలో వేగం పెంచారు. 2023 లో విడుదలైన గాలోడు (Gaalodu) సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు వెంకట్ దుగ్గిరెడ్డి. జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా, పి. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చక్కని న్యాయవాది పాత్ర పోషించారు.

ఆ తర్వాత పీవీ ఆర్ట్స్ పతాకంపై సాయికృష్ణ తల్లాడ దర్శకత్వంలో, వెంకట్ పులగం నిర్మాతగా తెరకెక్కిన మిస్టరీ (Mystery) సినిమాలో తనికెళ్ల భరణి, అలీ, సుమన్ ల సరసన డిటెక్టివ్ రోల్ లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో వెంకట్ దుగ్గిరెడ్డి నాచురల్ గా నటించారని ప్రముఖ నటులు సుమన్ (Actor Suman) కూడా ప్రెస్ మీట్ లో పొగడడం విశేషం.

ఇప్పుడు గేరు మార్చి స్పీడు పెంచారు. ఒకేసారి దాదాపు 8 సినిమాలలో నటిస్తున్నారు. విలక్షణమైన పాత్రలలో (విలన్, డిటెక్టివ్, డాక్టర్, కిల్లర్) వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) తనదైన ముద్ర వేస్తున్నారు. వీటిలో కొన్ని షూటింగ్ లో, మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉండగా, మంచు లక్ష్మి తో నటించిన సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

హీరోయిన్ ప్రియమణి (Priyamani) నటించే ఒక సినిమాలో, అలాగే టాలీవుడ్ (Tollywood) టాప్ దర్శకులు సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో రానున్న మరో సినిమాలో కూడా మంచి పాత్ర పోషించనున్నారని సమాచారం. ఇటువంటి సినిమాల వరసలో వెంకట్ దుగ్గిరెడ్డి ముఖ్య పాత్రలో వస్తున్న సినిమా ‘వాయుపుత్ర’ ప్రత్యేకతను సంతరించుకుంది.

జూన్ 6న టీజర్ విడుదల చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల కొంచెం ఆలస్యంగా త్వరలో విడుదల కానుంది. రంగమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో, రాము అజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాయుపుత్ర (Vaayuputra). వెంకట్ దుగ్గిరెడ్డి, రాజేంద్రప్రసాద్, దుర్గ గౌర లు నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈ మధ్యనే అట్లాంటా (Atlanta) లో విడుదల చేశారు.

విలక్షణ నటుడు వెంకట్ దుగ్గిరెడ్డి డిఫరెంట్ లుక్ తో, ఒక డెన్ లో చుట్టూ డబ్బు, గన్స్, సిగరెట్ కాలుస్తూ కన్నింగ్ లుక్ తో ఉన్న ఒక పోస్టర్ అందర్నీ ఆకర్షిస్తోంది. తన నటనతో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్న వెంకట్ దుగ్గిరెడ్డి ప్రస్తుతం వాయుపుత్ర (Vaayuputra) సినిమాలో ఫుల్ లెంగ్త్ కీ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలిసింది.

ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలో జరుపుకుంటుంది అని చిత్ర బృందం తెలిపారు. ఈ వాయు పుత్ర సినిమాకి కెమేరామెన్ గా సృజన్ కెదల పనిచేస్తున్నారు. షూటింగ్స్ కోసం పలుమార్లు ఇండియాకి (India) వెళ్లి రావడం చూస్తే సినిమాలపై వెంకట్ (Venkat Duggireddy) కి ఉన్న పాషన్ తెలుస్తుంది.

ఈ 2024 సంవత్సరం, గత 6 నెలల్లోనే నాలుగు సార్లు ఇండియా అమెరికా (United States of America) మధ్య అంతర్జాతీయ ప్రయాణం గావించడాన్ని చూసి అట్లాంటా (Atlanta) లోని వెంకట్ స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆశ్చర్యం వ్యక్త పరచడమే కాకుండా అభినందిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected