Connect with us

Associations

అమెరికాలో తెలుగు సంఘాలు, కుల సంఘాలు, నేటి పరిస్థితి!

Published

on

విజ్ఞానవంతులకు, వివేకవంతులకు మారు పేరు తెలుగువారు. తెలుగువారు విదేశాలలో ఉన్నా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొంటారు. అలాగే వీరికి సమాజ సేవ చెయ్యాలని ఆకాంక్షలు బహు మెండుగా ఉంటాయి. అందుకే తెలుగువారికి ఉన్న ఆర్గనైజేషన్స్ సంఖ్య మరే భాషవారికి ఉండవు.

నాణేనికి మరోవైపు ఆభిజాత్య భావాలు కూడా ఎక్కువగా ఉండడం వలన ఇలా వేల కొలది ఆర్గనైజేషన్స్ మొదలు అయ్యాయి అనే అపవాదు కూడా ఉంది. ఉదాహరణకి 1977లో మొదటి తెలుగు ఆర్గనైజేషన్ ఉత్తర ఆమెరికాలో మొదలైంది. అప్పటినుండి ఇప్పటివరకు చూస్తే కొన్నివందల తెలుగు సంఘాలు నేషన్ వైడ్ నుండి స్టేట్ వైడ్ వరకు మొదలు అవ్వడమే కాకుండా, కుల సంఘాలు కూడా మొదలు అయ్యాయి.

నేడు చూస్తే కుల సంఘం లేని తెలుగు సంస్థలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కొన్నేమో పేరుకు తెలుగు సంఘం, కానీ తమ కులం కాకపోతే సభ్యత్వం కూడా ఇవ్వవు. ఇంకొన్నేమో తమ కులంలోనే ఉప కులాల వాళ్ళను ఎదగనివ్వడంలేదని వాళ్ళల్లో వాళ్ళే బయటకి వెళ్లి ఇంకో తెలుగు సంఘం పెడతారు. మరి కొన్నేమో సేవలు కూడా తమ కులం వాళ్ళకే అందించే పరిస్థితి.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, కొన్ని తెలుగు సంఘాలు తప్పితే, మిగతావన్ని మెంబర్షిప్ మొదల్కొని ఆ సేవ, ఈ సేవ స్వదేశంలో చేస్తున్నామంటూ అదే పనిగా డొనేషన్స్ దండుకోవడమే పనిగా పెట్టుకొన్నాయి. దినితో సగటు తెలుగువాడి జేబులు చిల్లులు పడడం పరిపాటి అయ్యింది. దీంతో మనకెందుకురా ఖర్మ అనుకొంటూ నెమ్మది నెమ్మదిగా తెలుగు సంఘాల నుండి దూరం కావడమో లేదా నిర్లిప్తంగా ఉండడమో జరుగుతుంది.

అస్సలు తెలుగు సంఘాలు ఆలోచించవలసింది, ఇక్కడ ఉన్న తెలుగువారికి ఏవిదంగా సహాయపడుతున్నాము అన్నది. నూటికి 90 శాతం తెలుగువారు సింగిల్ ఫ్యేమిలి సంపాదన మాత్రమే. ఖర్చులు చూస్తే తడిసి మోపెడు అవుతున్నాయి. ఎన్ని ఆర్గనైజేషన్స్ అని ఇస్తాము, ఎంత అని ఇవ్వగలము? అదే పనిగా ఆవుని పాలకోసం పితికితే పాలు బదులు రక్తం కారుతుంది.

ఇది నేటి తెలుగోడి పరిస్థితి. అస్సలు అమెరికాలో ఉన్న తెలుగు వారికి మనం ఏవిదంగా సహాయపడగలము?

  1. కొన్ని విషాద పరిస్తితులలో సాటి తెలుగు వారిని కోల్పోవడం జరుగుతుంది. వెనువెంటనే వారి ఆత్మీయులు లేదా అత్యంత సన్నిహితులు “గొ ఫండ్” కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది అసలు గొ ఫండ్ కి వెళ్ళవలసిన పరిస్తితులు ఏమిటి? కూలంకుషంగా పరిశీలిస్తే చాలా తెలుగువారికి “విల్ అండ్ ట్రస్ట్” మీద పూర్తిస్తాయి అవగాగాహన లేకపోవడం మరియు ఇన్స్యూరెన్స్ మీద సరైన పరిణితి లేకపోవడం. ఇవి రెండూ ఉంటే ఏ తెలుగువారికి “గో ఫండ్” అవసరం లేదు. దీనిపై మొక్కుబడిగా తెలుగు సంఘాలు కార్యక్రమాలు చేస్తున్నాయి తప్పితే, కనీసం తమ సంఘ సబ్యత్యం తీసుకొన్నవారికి  వీటిని విదిగా ఫాలో అప్ చెయ్యడమే కాకుండా ప్రస్తుత మార్కెట్ లో దొరుకుతున్న వివిద ఇన్స్యూరెన్స్ కంపెనీలలో తక్కువ కోట్ కి ఎక్కువ లాభదాయకంగా ఉన్నవాటి గురించి డీల్ చెయ్యడం మరియు తెలుగు వారికి వాటిని అందించడంలో పూర్తిస్తాయి సహాయపడడం.
  2. ఉద్యోగ భద్రత మరియు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్: కొత్త కొత్త టెక్నాలజీలతో ప్రపంచం ముందుకు సాగుతుంటే చలా మంది ఎక్కడ వేసిన గొంగలి అంక్కడే ఉన్నట్టు అదే పాత చింతకాయ పచ్చడిలాగ ఉండిపోతున్నారు. తెలుగు సంఘాలు మళ్ళీ మొక్కుబడిగా కాకుండా, పూర్తి స్తాయి లేబ్ ఇస్తూ కనీసం వారం రోజుల పాటు ప్రతీ రోజు లేట్ ఈవినింగ్ శిక్షణాతరగతులు అనుభవజ్ణులచేత ఇస్తే ఉద్యోగ బద్రత పెరుగుతుంది.
  3. ఆర్ధిక స్వాతంత్రం: అసలు మనం ఇక్కడ బాగ ఉంటేనే కద, స్వదేశంలో విరివిరిగా విరాళాలు ఇవ్వగలం. ఎన్ని తెలుగు సంఘాలు ఎగ్రసివ్ గా దీని గురించి ఆలోచిస్తున్నాయి? కొత్త కొత్త వ్యాపారలలో భాగస్వామ్యం, స్టాక్ మార్కెట్ పై అవగాహనా సదస్సులు ఇలా ఎన్ని లేవు? రియల్ ఎస్టేట్, వ్యవసాయం. డాలర్ సంపాదించడంలో సాటి తెలుగు వారికి దశ, దిశ నిర్దేశం చెయ్యగలిగి ఉండాలి.
  4. పిల్లల కాలెజ్ ఫీజులు: 12వ తరగతి వరకు సరే, మరి కాలేజ్ ఫీజులు మాత్రం అకాశాన్ని అంటుకొంటున్నాయి. మరి వాటిపై అవగాహన ఉందా? సరైన ఎడ్యుకేషన్ ప్లాన్ ఉంటే కాలేజ్ కి వచ్చే పిల్లల తల్లిదండ్రులకు రిలీఫ్ గా ఉంటుంది. ఒక డోం తీసుకొంటే ఏవరేజ్ $500 నుండి $1000 వరకు నెల అద్దెలు ఉన్నాయి. ఇంక సెమిస్టర్ ఫీజులు తీసుకొంటే కనీసం $10000 నుండి $30000 వరకు ఉన్నాయి. ఎన్ని తెలుగు సంఘాలు వీటిపై దృష్టి పెట్టాయి? ఎప్పుడూ వారి సంఘ అర్బాటాలు చూపించుకోవడానికి వేలకు వేల డాలర్లు ఈవెంట్ పేరు మీద ఖర్చు పెట్టి, ఇక్కడ కూడా ఎన్.పి.ఒ మూల సిద్దాంతాలను పక్కన పెట్టి మేచింగ్ ఫండ్ పేరిట డబ్బులు దండుకోవడంలో పూర్తిగా నిమగ్నమై, శాలువాలు, సన్మానాలతో సరిపెడుతున్నాయి. ఇది నేటి పరిస్తితి.

గమనిక: తెలుగు సంఘాలపై గౌరవంతో అమెరికాలో ఉన్న తెలుగువారికి మరింత సేవ చేస్తారని ఆశిస్తూ ఈ విశ్లేషణ ముగిస్తున్నాను. ఈ విశ్లేషణ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

– సురేష్ కరోతు

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected