Connect with us

Associations

మంగళవారం మాటలతో మళ్లీ మభ్యపెట్టడానికి ముందుకొచ్చిన తానాలో ఓడిన వర్గం

Published

on

ఈమధ్యనే ముగిసిన తానా ఎన్నికలలో నిరంజన్ ప్యానెల్ నరేన్ కొడాలి ప్యానెల్ పై సంపూర్ణ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా గెలిచినవారు గెలుపును ఆస్వాదిస్తుంటే ఓడినవారు తమ ఓటమికి కారణాలు వెతుక్కొని సంస్థాగతంగా ఎక్కడ దెబ్బతిన్నారో పోస్ట్ మార్టం చేసుకుంటారు. కానీ తానాలో ఓడిన వర్గం మాత్రం అందుకు విరుద్ధంగా మంగళవారం మాటలు, చేష్టలు మొదలుపెట్టింది. అదేంటో తెలియాలంటే ఇంకొంచెం చదవాల్సిందే.

నెంబర్ గేమ్ లో వెనకబడ్డామని పబ్లిక్ గా ఎలక్షన్ కి ముందే ఒప్పుకున్న ఆ వర్గం, క్యాడర్ కి మాత్రం మసిపూసి మారేడుకాయలు చేసిన చందాన అదిగో పులి ఇదిగో పులిలా అదిగో మనం గెలుస్తున్నాం ఇదిగో మనం గెలుస్తున్నాం అంటూ ఊదరగొట్టింది. పాపం వాళ్ళని నమ్మి కొంతమంది బెట్టింగుల్లో క్షవరం కూడా చేసుకున్నారు. దీంతోపాటు మరీ 10% ఓట్ల పైన తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో గాడ్ ఫాదర్లు గా ఇన్నాళ్లు తెగ బిల్డప్ ఇచ్చిన వారి మీద ఒత్తిడి బాగా పెరిగిపోయింది. దీంతో కొత్త డ్రామా మొదలుపెట్టారు.

ఎలక్షన్స్ లో పారదర్శకత లోపించిందని, కౌంటింగ్ యంత్రాలపై అనుమానం ఉందని, ఎలక్షన్స్ నిర్వహించిన థర్డ్ పార్టీపై అనుమానం ఉందని ఇలా వగైరా వగైరా సన్నాయి నొక్కులు నొక్కుతూ తానా బోర్డుకి మరియు ఎలక్షన్ కమిటీకి ఫలితాల ప్రకటన నిలిపివేయాల్సిందిగా అప్పీల్ చేసారు. అప్పీల్ చేసిన కారణాలు చూస్తే మనకు నవ్వు రాక తప్పదు. తమని నమ్ముకున్న ప్యానెల్ ని గాలికొదిలేసి మాకు ఒక్క ప్రెసిడెంట్ ఓటు వేయండి మిగతావి మీ ఇష్టం అంటూ తమ ప్యానెల్లోని మిగతావారికి హ్యాండ్ ఇచ్చిన వీరికి తమ ప్యానెల్ లోని మిగతా వారు అప్పీల్ లో కూడా వంతపాడటం అమాయకత్వమే అనుకోవాలి. టీం అందరిలోకెల్లా నరేన్ కి తక్కువ ఓట్లు రావడం దీనికి నిదర్శనం. విడ్డూరం ఏంటంటే ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా ఇంత టైం పెట్టే వీరికి 2019 కాన్ఫరెన్స్ లెక్కలు సబ్మిట్ చెయ్యడానికి మాత్రం రెండు సంవత్సరాలైపోయినా టైం ఉండదు. చూద్దాం ముందు ముందు ఇంకెన్ని డ్రామాలు రక్తి కట్టిస్తారో!

error: NRI2NRI.COM copyright content is protected