Connect with us

Movies

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి షార్ట్ ఫిలిం?

Published

on

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రూపొందించే ప‌నిలో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంత బిజీ షెడ్యూల్లోనూ ఆయ‌న మ‌రో సినిమా చేయబోతున్నారని సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌. అయితే రాజ‌మౌళి చేయ‌బోయేది షార్ట్ ఫిల్మ్ అని స‌మాచారం. కొవిడ్ స‌మ‌యంలో ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌గా, ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి విధులు నిర్వ‌హిస్తున్న పోలీస్ డిపార్ట్‌మెంట్ గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసేలా రాజ‌మౌళి షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించ‌నున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ వివ‌రాల‌ను పోలీసు ఉన్న‌తాధికారుల‌కు తెలియ‌జేయ‌డం వారు ఓకే చెప్ప‌డం జరిగాయట. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి పోలీసుల‌పై చేయ‌నున్న షార్ట్ ఫిల్మ్ గురించి త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

error: NRI2NRI.COM copyright content is protected