Connect with us

Convention

ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్‌లో తానా బృందం సందడి

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల వేదిక ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌ను తానా నాయకత్వం, కమీటీ సభ్యులు శుక్రవారం ఆగష్టు 5 నాడు సందర్శించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, మహాసభల సమన్వయకర్త పొట్లూరి రవి నాయకత్వంలోని తానా బృందం కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రతినిధులు రస్సెల్ కైస్, ఆంథోనీ నెల్సన్ తో పలు విషయాలపై మాట్లాడారు.

సమావేశం తర్వాత మహాసభలు జరిగే కన్వెన్షన్‌ సెంటర్‌ను తానా నాయకులు సందర్శించారు. కన్వెన్షన్‌ సెంటర్లో ఉన్న సదుపాయాలు, సౌకర్యాలను తెలుసుకున్నారు. అమెరికా తూర్పు తీరంలో (ఈస్ట్ కోస్ట్) లో అన్ని సౌకర్యాలతో అందరికీ అందుబాటులో ఉన్న పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జులై 7 నుండి 9 వరకు నిర్వహించే 23వ తానా మహాసభలని తానా నాయకత్వం, స్థానిక తెలుగు ప్రజలు, దాతల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు తెలిపారు.

తానా మహాసభల కోఆర్డినేటర్ పొట్లూరి రవి పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉన్న ఏర్పాట్లను తానా నాయకుల బృందానికి వివరించారు. కార్యక్రమానికి హాజరైన తానా ప్రతినిధులకు తానా మిడ్ అట్లాంటిక్ రీజినల్ కోఆర్డినేటర్ సునీల్ కోగంటి ధన్యవాదాలు తెలిపారు.

తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌, తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్లు శ్రీనివాస్ లావు, లక్ష్మీ దేవినేని, జనార్దన్ నిమ్మలపూడి తానా కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీలు విద్యాధర్ గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, తానా న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ వంశి వాసిరెడ్డి, టిటిఎ ఉపాధ్యక్షులు, సురేష్ రెడ్డి వెంకన్నగారి, తానా నాయకులు హరీష్ కోయ, రవి మందలపు, సతీష్ తుమ్మల, శ్రీ అట్లూరి, శ్రీ చౌదరి, స్వాతి అట్లూరి, రాహుల్ ఎర్రా, హరి మోటుపల్లి, వెంకట్ చిమ్మిలి, శశిధర్ జాస్తి, లక్ష్మి అద్దంకి, శ్రీలక్ష్మి కులకర్ణి, వెంకట్ సింగు, వెంకట్ ధనియాల, శ్రీనివాస్ భరతవరపు, శ్రీనివాస్ కాశీమహంతు, హరనాథ్ దొడ్డపనేని, నాయుడు మోటుపల్లి, గుంటూరు మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected