Connect with us

Convention

జోరుగా ATA Convention ఏర్పాట్లు, పలు రెజిస్ట్రేషన్స్ ఓపెన్

Published

on

అమెరికాలోని తెలుగు సంస్థలు మన సంస్కృతి, సాంప్రదాయం, సాహిత్యం, అవగాహన సదస్సులు, సేవ మరియు సహాయ కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందు ఉంటాయి. 1990లో మొదలైన అమెరికా తెలుగు సంఘం ATA (American Telugu Association) గత 34 సంవత్సరాలుగా తెలుగు వారికి అన్ని విషయాలలో వెన్ను దున్నుగా ఉంటూ, అప్రతిహతంగా సాగిపోతోంది. ఆటా కేవలం అమెరికాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, కొనసాగిస్తున్నారు.

జాతీయ సంస్థలు 2 సంవత్సరాలకు ఒకసారి భారీగా కన్వెన్షన్ (Convention) నిర్వహిస్తూ ఉంటారు. అందులో ఆట, మాట, పాటల పోటీలు, పేజంట్లు, మ్యూజికల్ కాన్సర్ట్లు, సదస్సులు ఇంకా మరెన్నో ఉంటాయి. ఆటా కన్వెన్షన్ 2024 ఈ సారి అట్లాంటా (Atlanta) లో జూన్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా, సర్వ జనులకు ఉపయుక్తంగా జరగబోతున్నది. పోయిన సంవత్సరం నుండే మొదలైన ఏర్పాట్లు, ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. ఎన్నో ప్రాంతాలలో ఫండ్ రైజింగ్, కిక్ ఆఫ్ మీటింగులు జరిగాయి.

అధ్యక్షురాలు మధు బొమ్మినేని (Madhu Bommineni), కన్వీనర్ కిరణ్ పాశం (Kiran Pasham) నాయకత్వంలో కోర్ కమిటీ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కోకన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కోకోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కోడైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో దాదాపు 70 కమిటీలలో 300 మందికి పైగా వాలంటీర్లు అవిశ్రాంతంగా పాటు పడుతున్నారు. వీరందరూ వారానికి ఒక్కసారి ఇన్ పర్సన్ మరియు ఆన్లైన్ మీటింగుల ద్వారా కలుస్తూ, గతిని, ప్రగతిని పరిశీలిస్తూ, సూచనలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కార్యక్రమాల వివరములకు www.ATAconference.org ని సందర్శించండి.

ఆటా వారి సిగ్నేచర్ పోటీలు చాలా ఉన్నాయి. కొన్ని డైరెక్టుగా కన్వెన్షన్ లో ఉంటాయి, కొన్ని వివిధ నగరాలలో నిర్వహించి, ఫైనల్స్ కన్వెన్షన్ అప్పుడు జరుగుతాయి. 3 రోజుల పాటు సాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ (Cultural Programs) రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 29. సంబంధిత లింక్, ఫ్లయర్ క్రింద చూడగలరు.
www.NRI2NRI.com/ATA 18th Convention Cultural Registration

ఉత్సాహవంతులైన గాయనీ గాయకులకు అత్యంత ప్రోత్సాహకరంగా నువ్వా నేనా అన్నట్టు సాగే ‘ఝుమ్మంది నాదం’ పాటల పోటీలు (Singing Cpmpetition) పలు నగరాలలో నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లింకు మరియు శాంపిల్ ఫ్లయర్ (ఒక్కొక్క నగరానికి ఒక్కొక్కటి ఉంటుంది) క్రింద ఇవ్వడం జరిగింది.
www.NRI2NRI.com/ATA 18th Convention Jhummandi Naadam

సయ్యంటే సై అన్నట్టుగా సాగే ‘సయ్యంది పాదం’ సరే సరి. కాలు కడుపుదాం, ప్రైజ్ గెలుద్దాం అనుకుంటున్నారా, ఇకనేం డాన్స్ పోటీలకు (Dance Competition) నమోదు చేసుకోండి. ఎన్నో అమెరికన్ సిటీస్ లో జరిగే ఈ కార్యక్రమానికి లింకు, ఫ్లయర్ ఇక్కడ చూడండి.
www.NRI2NRI.com/ATA 18th Convention Sayyaandi Paadam

వనితలకు, మగవారికి, యువతకు ఆత్మ విశ్వాసాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చే బ్యూటీ పెజంట్ (Beauty Pageant) కూడా చాలా చోట్ల నిర్వహించనున్నారు. పాల్గొన దలచినవారు ఈ క్రింది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. అలానే, అట్లాంటా ఫ్లయర్ కూడా చూడగలరు.
www.NRI2NRI.com/ATA 18th Convention Beauty Pageant

ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాబోతున్నాయి. చాలామంది వేసవి సెలవల్లో ఇండియా వెళుతూ ఉంటారు. ఆటా కన్వెన్షన్ వల్ల ఎంతో మంది జూన్ 2వ వారం లేక ఆ తర్వాత వెళ్లేట్లుగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మీరు కూడా ఈ గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకోండి, విజ్ఞాన వినోదాలలో భాగం కండి. ప్రతి వారం మరిన్ని వివరములతో మీ ముందుకు వస్తుంటాము, గమనించగలరు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected