Connect with us

Movies

తానా మహాసభల కోసం ట్రెండీ హీరోయిన్‌ శ్రీలీల అమెరికాలో అడుగు

Published

on

తానా 23వ మహాసభలు ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి (Ravi Potluri) కన్వీనర్ గా, శ్రీనివాస్ లావు (Srinivas Lavu) ఛైర్మన్ గా ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) మహాసభల్లో పాల్గొనేందుకు రాజకీయ, సినీరంగ ప్రముఖులతోపాటు సాహితీవేత్తలు, కవులు, ఇతర కళాకారులు, పారిశ్రామికవేత్తలు, మ్యూజిక్‌ డైరెక్టర్లు వస్తున్నారు.

ఈ మహాసభల్లో పాల్గొనేందుకు హీరోయిన్‌ శ్రీలీల వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఆమెకు తానా నాయకులు ఘన స్వాగతం పలికారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, జగదీశ్‌ ప్రభల, రామ్ చౌదరి ఉప్పుటూరి, రమాకాంత్ కోయ తదితరులు ఆమెను స్వాగతించారు.

ఈ మహాసభలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ లావు కృషి చేస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected