Connect with us

Sports

US త్రోబాల్‌ మహిళా జట్టుకి తానా నాయకుల తోడ్పాటు: Bahrain Indo-Gulf 2024, Middle East

Published

on

Bahrain, Middle East: బహ్రెయిన్‌ లో ఫిబ్రవరి 23వ తేదీన జరగనున్న ఇండో గల్ఫ్‌ 2024 త్రోబాల్‌ ఛాంపియన్‌ షిప్‌ లో పాల్గొనేందుకు అమెరికా మహిళా టీమ్‌ ఎంపికైంది. ఈ ఇంటర్నేషనల్‌ త్రోబాల్‌ ఛాంపియన్షిప్ ను ఇంటర్నేషనల్‌ త్రోబాల్‌ ఫెడరేషన్‌ (International Throwball Federation) తో కలిసి ది ఇండియన్‌ క్లబ్‌ (The Indian Club) నిర్వహిస్తోంది.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ సెక్రటరీ ఎలక్ట్‌ రాజా కసుకుర్తి, తానా స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ ఎలక్ట్‌ నాగ పంచుమర్తి మరియు తానా (TANA) ఇంటర్నేషనల్‌ కోఆర్డినేటర్‌ ఎలక్ట్‌ ఠాగూర్‌ మల్లినేని ఈ అమెరికా (USA) మహిళా టీమ్‌ (SportyDivas) కు స్పాన్సర్‌ చేసి తోడ్పాటు అందిస్తున్నారు.

తమకు స్పాన్సర్‌ చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా (Telugu Association of North America) నాయకులకు మహిళా క్రీడాకారులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రవాసులు తానా నాయకులను (TANA Leaders) అభినందిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected