Connect with us

Education

రాజమహేంద్రవరంలోని లైబ్రరీకి పుస్తకాలు సమకూర్చిన తానా: సతీష్ చుండ్రు, రవి పొట్లూరి

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో డిసెంబర్ 31న రాజమహేంద్రవరంలోని బివిఎం స్కూల్ లైబ్రరీకి 234 పుస్తకాలు అందజేశారు. దీనికి స్పాన్సర్ రవి పొట్లూరి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తానా లైబ్రరీస్ కోఆర్డినేటర్ సతీష్ చుండ్రు మాట్లాడుతూ తానా ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, తద్వారా జ్ఞాన సముపార్జన సాధ్యమని అన్నారు.

ఇంకా సతీష్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన బివిఎం స్కూల్లోనే తన భార్య విద్యాభ్యాసం చేశారని, అటువంటి పాఠశాలకు తానా ద్వారా పుస్తకాలు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ఫౌండేషన్‌ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, స్పాన్సర్ రవి పొట్లూరి, రాజా కసుకర్తి తదితరుల సహకారంతో ఎన్నో కార్యక్రమాలను లైబ్రరీస్ కో ఆర్డినేటర్లుగా ఉన్న తాను, రమణ అన్నె కలిపి ఈ కార్యక్రమం తలపెట్టామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.

పాఠశాల సీనియర్ సభ్యులు ఎఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ బివిఎం పాఠశాలలో చదుకున్న ఎంతోమంది ప్రతిష్ఠాత్మకమైన తానాలో సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. తానా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు‌. ఈ సందర్భంగా విద్యార్ధులకు చుండ్రు సతీష్ పుస్తకాలను అందజేసి పాఠశాలలో ఉన్న డిజిటల్ రూమ్, కంప్యూటర్ రూమ్, లైబ్రరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు లయన్ క్రొవ్వడి సాయికుమార్, సెక్రటరీ ఎమ్.ఎన్.వి.ఎస్.మురళీకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవోలు సుబ్బలక్ష్మి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected