Connect with us

Associations

విద్యార్థుల్లో పోటీతత్వాన్ని నింపిన తానా క్యూరీ మ్యాథ్ & సైన్స్ పోటీలు

Published

on

గత 5 సంవత్సరాలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరియు క్యూరీ లెర్నింగ్ వారు సంయుక్తంగా మ్యాథ్, సైన్స్ బౌల్ వార్షిక పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరాలకు భిన్నంగా ఈ సంవత్సరం ఉత్తర అమెరికా అంతటా ఒకేసారి ఆగష్టు 22న ఆన్లైన్లో ఈ పోటీలు నిర్వహించడం విశేషం. పిల్లలు వారి వారి స్కూల్స్లో చదివే క్లాసులను అనుసరించి 3 గ్రూపులుగా విభజించి, మ్యాథ్ బౌల్ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు, సైన్స్ బౌల్ మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల వరకు నిర్వహించారు. 3, 4 తరగతుల విద్యార్థులు ఒక సమూహంగా 5, 6 తరగతుల విద్యార్థులు ఇంకో సమూహంగా అలాగే 7, 8 తరగతుల విద్యార్థులు మరొక సమూహంగా వర్గీకరించారు. మన తరువాతి తరం పిల్లలు 625 మంది పాల్గొనడం అభినందనీయం.

విజేతల వివరాలను విడుదల చేసేందుకు సెప్టెంబర్ 11న ఆన్లైన్లో మరో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తానా ప్రస్తుత అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, పూర్వ అధ్యక్షులు జయ్ తాళ్లూరి, క్యూరీ వ్యవస్థాపకులు డాక్టర్ రావు మూల్పూరి పాల్గొన్నారు. విజేతల ప్రకటన అనంతరం అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా నాయకత్వం మున్ముందు కూడా మన తరువాతి తరం పిల్లలకి ఉపయోగపడే కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందన్నారు. ఈ విషయంలో క్యూరీ లెర్నింగ్ వారి సహకారం మరువలేనిదని, పిల్లలు ఈ పోటీలలో విరివిగా పాల్గొనడం శుభపరిణామం అన్నారు. మ్యాథ్ బౌల్ పోటీలు విశ్లేషణాత్మకంగా ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ని పెంపొందించేలా, సైన్స్ బౌల్ పోటీలు ఆచరణలో ఎలా వర్తించాలో ఆలోచించేలా నిర్వహించడం క్యూరీ లెర్నింగ్ ప్రత్యేకత అని అన్నారు. ఇటువంటి పోటీల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచి స్కూల్స్లో రాణించడానికి తానా చేస్తున్న ప్రయత్నాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

ఈ పోటీల నిర్వహణలో ముందునుండి తోడ్పడిన ఠాగూర్ మల్లినేని, విద్య కూచిపూడి, గౌరి వేమూరి, శ్రీనివాస్ ఉయ్యూరు లను అందరూ అభినందించారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా విజేతలకు ట్రోఫీలు మెయిల్లో, సర్టిఫికేట్లు ఎలక్ట్రానిక్ పద్దతిలో అందజేస్తారు. విజేతల పూర్తి వివరాలను లింక్ లో చూడగలరు.

error: NRI2NRI.COM copyright content is protected