Connect with us

Concert

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లైవ్ కాన్సర్ట్ @ AAA 1st National Convention, Philadelphia

Published

on

ఫిలడెల్ఫియా (Philadelphia) లో మార్చి 28 మరియు 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి నేషనల్ కన్వెన్షన్ (Convention) కి పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నిర్మాతలు వస్తున్నట్లు వీడియోలు కూడా విడుదల చేశారు.

కన్వెన్షన్ రెండో రోజులో భాగంగా టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Ghantasala Sai Srinivas Sivakumar) తన ట్రూప్ తో లైవ్ కాన్సర్ట్ (Live Musical Concert) నిర్వహించనున్నారు. 15 మందితో కూడిన పవర్ఫుల్ తమన్ ట్రూప్ ఫిలడెల్ఫియాని హోరెత్తించడానికి క్లాస్, మాస్ బీట్స్ తో సన్నద్ధమవుతున్నారు.

టాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోల వరుస సూపర్ హిట్ మూవీస్ తో దూసుకెళుతున్న సంగీత దర్శకులు తమన్ (SS Thaman) కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అందునా ఈ ట్రూప్ లో శ్రీకృష్ణ, సాకేత్ కోమండూరి, మనీషా, వాగ్దేవి వంటి ఫేమస్ సింగర్స్ కూడా ఉన్నారు. దీంతో అందరూ ఈ కాన్సర్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

5 సంవత్సరాలు మరియు ఆపై వయస్కులకు ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ లో భాగంగా $50 నామమాత్రపు ధరకి (Nominal Price) ఈ లైవ్ కాన్సర్ట్ టికెట్స్ అందిస్తున్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఎంట్రీ ఫ్రీ. రెండు రోజులపాటు పవర్ ప్యాక్డ్ కార్యక్రమాలతో అమెరికా ప్రవాసులలో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ AAA కన్వెన్షన్ కి త్వరగా రిజిస్టర్ చేసుకోండి.

Convention Banquet: https://nationalconvention1.theaaa.org/banquet-seats
Convention Day 2, Thaman Concert: https://nationalconvention1.theaaa.org/event-registration.html

Vendor Exhibits: https://nationalconvention1.theaaa.org/exhibits-seats
AAA Membership: https://www.theaaa.org/global/member-registration

error: NRI2NRI.COM copyright content is protected