Connect with us

News

“A True Next Gen Kid” with proven track record: Shashank Yarlagadda

Published

on

Shashank Yarlagadda

సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం తనదైన స్టైల్ లో అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ లో సింగిల్ పాయింట్ ఎజెండా నాది, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ని తానా వైపు తిప్పుతానంటూ #TANANexGen హ్యాష్ టాగ్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ది రియల్ నెక్స్ట్ జనరేషన్ కిడ్ శశాంక్ యార్లగడ్డ (Shashank Yarlagadda).

ఒట్టేసినా అదే మాట ఒట్టేయకున్నా అదే మాట అన్న చందాన తానా క్రీడాకార్యదర్శిగా ఎన్నికైన దగ్గిర నుండి గత 30 నెలలుగా పక్కా యాక్షన్ ప్లాన్ తో పాత, ప్రస్తుత మరియు కొత్త తరాలను సమన్వయం చేసుకుంటూ అద్వితీయంగా ముందుకు సాగుతున్నారు శశాంక్ (Shashank Yarlagadda).

46 ఏళ్ళ తానా చరిత్ర పుస్తకంలో తనకంటూ ఒక పేజీ రాసుకున్నారు. తానా (Telugu Association of North America) క్రీడల గతిని మారుస్తూ అనితరసాధ్యమైన 40 క్రీడా కార్యక్రమాలను ఇటు అమెరికా అటు ఇండియాలో నిర్వహించి నూతన ఒరవడి సృష్టించడమే కాకుండా క్రీడాస్ఫూర్తిని ఇనుమడింపజేశారు.

దిస్ ఈస్ నాట్ ఏ వన్ టైం రికార్డ్, ఇట్స్ యాన్ ఆల్ టైం రికార్డ్ అని రీల్ లైఫ్ లో ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu) చెప్పిన డైలాగ్ ని రియల్ లైఫ్ లో శశాంక్ యార్లగడ్డ నిజం చేశారనడం అతిశయోక్తి కాదు. తానా (TANA) లో సరికొత్త క్రీడలకు అంకురార్పణ చేయడానికి కర్త కర్మ క్రియ యువ సామ్రాట్ శశాంక్ యార్లగడ్డ నే.

మహిళలకు పెద్దపీట వేస్తూ అమెరికా నలుమూలల నుంచి 16 జట్లతో, దాదాపు 150 మంది మహిళా క్రీడాకారుణులతో జాతీయస్థాయి మహిళా త్రోబాల్ ఛాంపియన్షిప్ (National Women Throwball Championship) నిర్వహించారు శశాంక్. దీంతో తానా క్రీడల స్థాయిని పెంచారంటూ మహిళలు సైతం అభినందించడం విశేషం. అలాగే టి5 ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.

పరాయి దేశంలో ఉన్న ఒక తెలుగు సంఘం సౌత్ ఇండియా స్థాయిలో దివ్యాంగుల కోసం ఒక క్రీడాకార్యక్రమం నిర్వహిస్తుందా అంటూ అందరూ నోరు కరుచుకునేలా చేసిన సమర్ధత శశాంక్ యార్లగడ్డ సొంతం. ముందుగా దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ పోటీలు (Differently Abled Wheelchair Cricket Tournament) ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నడుమ నిర్వహించారు.

అనంతరం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) లో భాగమైన డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCCI) లోని ఆంధ్రప్రదేశ్ వీల్ ఛైర్ & డిజబిలిటీ క్రికెట్ అసోసియేషన్ (APWDCA) తో సమన్వయం చేసుకొని ఇండియాలో రెండు నెలలు తిష్ట వేసి మరీ సౌత్ ఇండియా దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించారు.

దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల దివ్యాంగ జట్లతో నిర్వహించి అందరినీ అబ్బురపరిచిన ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ వీల్ ఛైర్ క్రికెట్ పోటీలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ టీవీ, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సైతం ప్రతి రోజూ పతాక శీర్షికల్లో కవర్ చేయడం అంగవైకల్యం ఉన్నవారిని సైతం కదిలించింది.

శశాంక్ యార్లగడ్డ ఇంతకు ముందు ప్రామిస్ చేసినట్టే నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ని ఇన్వాల్వ్ చేసేలా సృజనాత్మక ఆలోచనలతో అమెరికాలో నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ఎక్కువగా మరియు మక్కువగా ఆడే త్రీ ఆన్ త్రీ బాస్కెట్ బాల్ (Basket Ball), అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ (Football) లీగ్ వంటి క్రీడలను ప్రోత్సహించి అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు.

భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అమితంగా ఇష్టపడే క్రికెట్ (Cricket) ఆటను డిటైల్డ్ రోడ్ మ్యాప్ తో జాతీయ స్థాయిలో తానా క్రికెట్ ఛాంపియన్షిప్ అంటూ మొట్టమొదటిసారి నిర్వహించి అమెరికాలోని తెలుగువారందరూ తనవైపు చూసేలా చేశారు శశాంక్. తెలుగేతరులు సైతం ఈ క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) తలమానికంగా ఉందని అభినందించడం కొసమెరుపు.

అమెరికా మొత్తాన్ని కొన్ని రీజియన్స్ గా విభజించి ముందు సిటీ స్థాయిలో లోకల్ గ్రూప్ ఫార్మాట్ టోర్నమెంట్స్ ఆడి గెలిచిన వారు రీజియన్ స్థాయిలో నాకౌట్ ఫార్మాట్లో పోటీపడేలా, అలాగే రీజియన్ స్థాయిలో ఆడి గెలిచిన వారు జాతీయ స్థాయిలో నాకౌట్ ఫార్మాట్లో పోటీపడేలా, చివరిగా జాతీయ స్థాయిలో గెలిచిన జట్టుకి తానా జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ కప్ అందించేలా పక్కా ప్రణాళికతో నిర్వహించారు.

తానా (TANA) క్రీడాకార్యదర్శిగా చెప్పిందానికంటే వంద రెట్లు చేతల్లో చూపిన స్పోర్ట్స్ ఆక్టివిటీస్ శశాంక్ లో ఒక పార్శ్వమ్ అయితే సామజిక సేవ (Social Service) మరో పార్శ్వమ్. నాటకాలు వేస్తూ కళలను మన ముందు తరాల వారికి చేరేలా కృషి చేస్తున్న సురభి థియేటర్ కళాకారుల పిల్లలకు స్కాలర్షిప్స్ అందించి చేయూతనిచ్చారు.

అలాగే తెలుగు రాష్ట్రాల్లోని పేద క్రీడాకారులకు ప్రొఫెషనల్ ఇంగ్లీష్ విల్లో (English Willow) బ్యాట్స్ అందించడం, తానా అన్నపూర్ణ ప్రాజెక్ట్ ద్వారా హాస్పిటల్స్ లో పేద బాలింతలకు, పిల్లలకు పోషకాహారం అందించడం వంటి పలు తానా ఫౌండేషన్ కార్యక్రమాలకు తనదైన సాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.

అమెరికాలో స్థానికంగా తానా ఆధ్వర్యంలో ఫస్ట్ రెస్పాండెర్స్ (First Responders) కి ఆహార పంపిణీ, పేద పాఠశాల విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్‌ల వితరణ లాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. చిన్నది పెద్దది అంటూ తేడా లేకుండా ప్రతి కార్యక్రమానికి బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి అనితర సాధ్యమైన విజయాలను అందుకుంటూ గురుతర బాధ్యతలను నిర్వర్తించారు.

ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ ఎన్నికలలో సంయుక్త కోశాధికారి (Joint Treasurer) పదవికి పోటీచేస్తున్నారు శశాంక్ యార్లగడ్డ. స్వతహాగా ఫుట్బాల్ క్రీడాకారుడైన ఈ యువతేజం కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకు వస్తుండడంతో శశాంక్ ఈస్ లీడింగ్ బై ఎగ్జామ్పుల్ అంటున్నారు.

చికాగో (Chicago) లో మిడిల్ స్కూల్ & హైస్కూల్ విద్యను, జాక్సన్ మిస్సిస్సిప్పి (Jackson, Mississippi) లో కాలేజీ విద్యను అభ్యసించిన శశాంక్ క్రికెట్, అమెరికన్ ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో సత్తా చాటారు. జాక్సన్ విశ్వవిద్యాలయ క్రికెట్ జట్టులోనే గాక స్థానిక జట్లలో కూడా శశాంక్ ఉత్సాహవంతమైన క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు.

అన్న, అంకుల్ అంటూ కలుపుకుపోవడంతోపాటు అందరికీ తలలో నాలుకలా ఉంటున్న శశాంక్ యార్లగడ్డ లాంటి యువతను తానాలో ప్రోత్సహిస్తే ముందుముందు ఇంకా చాలా మంది యువతీయువకులు తానా వైపు మళ్లే అవకాశం ఉంటుందని, కావున శశాంక్ యార్లగడ్డ తోపాటు టీం వేమూరి (Team Vemuri) కి వోట్ వేస్తే బాగుంటుందని పలువురు ప్రవాసులు బలంగా నమ్ముతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected