Connect with us

Amaravati

అమరావతి రైతులకు సంఘీభావంగా అక్టోబర్ 16న అట్లాంటాలో హైకింగ్ @ సానీ మౌంటైన్

Published

on

సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రభుత్వం 3 రాజధానులంటూ మోసం చేసిన సంగతి తెలిసిందే.

రైతులు దీనిపై కోర్టుల్లో ఒక పక్క న్యాయం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇంకోపక్క ప్రజా క్షేత్రంలో కూడా తమకు జరిగిన అన్యాయాన్ని సాటిచెప్పాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు 2021లో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ప్రజా మహా పాదయాత్ర’ ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయవంతంగా ముగించారు.

ఇప్పుడు రైతులు మళ్ళీ అమరావతి నుంచి అరసవల్లి (Amaravati to Arasavalli) వరకు ప్రజా మహా పాదయాత్ర 2.0 తో సెప్టెంబర్ 12 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. దీనికి సంఘీభావంగా గతంలో లానే అట్లాంటా వాసులు మళ్ళీ తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సానీ మౌంటైన్ (Sawnee Mountain) ఇండియన్ సీట్స్ ట్రైల్ లో పెద్ద ఎత్తున హైకింగ్ చేయనున్నారు.

వచ్చే ఆదివారం అక్టోబర్ 16న ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించే ఈ హైకింగ్ లో అట్లాంటా తెలుగు వారందరూ పాల్గొని తమ గళం గట్టిగా వినిపించి అమరావతి రైతులకు (Amaravati Farmers) మద్దతు తెలపాలని కోరుతున్నారు. రెజిస్ట్రేషన్ కొరకు www.NRI2NRI.com/HikeNSupportAmaravatiFarmers ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected