Connect with us

Politics

బాబు అరెస్టుకు నిరసనగా అమెరికా ప్రధమ రాజధానిలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం: Philadelphia

Published

on

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు (Telugu Desam Party) అక్రమ అరెస్టుకు నిరసనగా అమెరికా ప్రధమ రాజధాని ఫిలడెల్ఫియా (Philadelphia) లో “న్యాయానికి సంకెళ్లు” కార్యక్రమంలో టీడీపీ / ప్రవాస భారతీయలు పాల్గొన్నారు.

అమెరికాకు స్వాతంత్య్రాన్ని రూపొందించి భద్రపరిచిన రాజ్యాంగ కేంద్రం దగ్గర మరియు ప్రధమ రాజధాని ఫిలడెల్ఫియా సిటీ హాల్ (Philadelphia City Hall) దగ్గర వారి నిరసన తెలియజేసి, చంద్రబాబు (Nara Chandrababu Naidu) పోరాటానికి మద్దతు తెలియజేసారు.

ఈ సందర్భంగా ఉయ్ వాంట్ జస్టిస్, సేవ్ డెమోక్రసి, సైకో పోవాలి.. సైకిల్ రావాలి, ఉయ్ ఆర్ విత్ సిబిఎన్ అంటూ పలు నినాదాలు చేశారు. ప్లకార్డ్స్, చంద్రబాబు ఫోటోలు ప్రదర్శించారు. చేతులకు సంకెళ్లు వేసుకొని న్యాయానికి సంకెళ్లు వేశారంటూ నిరసన తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected