Connect with us

News

CBN కోసం ఫిలడెల్ఫియా సాయిబాబా మందిరంలో శాంతి హోమం

Published

on

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (CBN) అక్రమకేసుల నుంచి కడిగిన ముత్యం లాగా బయటకు రావాలని, ఆయురారోగ్యాలని ప్రసాదించాలని ఫిలడెల్ఫియా ఎన్నారైలు శాంతి హోమం నిర్వహించారు.

నవంబర్ 18, శనివారం నాడు ఫిలడెల్ఫియా (Philadelphia) లోని మాల్వేర్న్ సాయిబాబా మందిరంలో వేద పండితులతో నిర్వహించిన శాంతి హోమంలో మూడు వందల మందికి పైగా ఎన్నారైలు పాల్గొన్నారు.

నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుజాతి పునర్వైభవానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా అభిలాషించారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కి బెయిల్ రావడం విశేషం.

ఫిలడెల్ఫియా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్బంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected