Connect with us

News

న్యూజెర్సీ విరానీ జువెలర్స్ లో గన్ పాయింట్ దొంగతనం

Published

on

అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో గన్ పాయింట్ దొంగతనం జరిగింది. స్థానిక ఎడిసన్ పట్టణ నడిబొడ్డున ఉన్న ఓక్ ట్రీ రోడ్ లోని విరానీ జువెలర్స్ లో ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. సుమారు 6 గురు దుండగులు మొఖం కనబడకుండా గన్స్ తో వచ్చి లూటీ చేసినట్లు విరానీ జువెలర్స్ స్టోర్ వీడియోలో రికార్డు అయ్యింది.

మొత్తం రెప్పపాటులో జరిగిన దుర్ఘటనతో విరానీ గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ ఉద్యోగస్తులు భయకంపితులయ్యారు. స్థానిక భారతీయులు ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండించారు. అలాగే పోలీసులు కూడా పెద్ద ఎత్తున విచారణ చేపట్టారు. కొన్ని గంటల క్రితం అనగా అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం జూన్ 10 రాత్రి సుమారు 8 గంటలకు ఈ దొంగతనం జరిగినట్టు తెలిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected