Connect with us

News

హైదరాబాద్ లో బయలుదేరిన బాలయ్య, న్యూయార్క్ లో స్వాగత ఏర్పాట్లు

Published

on

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జులై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలకు (23rd Conference) ముఖ్య అతిధిగా నటులు, నిర్మాత, శాసనసభ సభ్యులు, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ హాజరవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

తానా 23వ మహాసభలలో పాల్గొనేందుకు ఈరోజు హైదరాబాద్ లో బయలుదేరారు. నందమూరి వసుంధర దేవి (Nandamuri Vasundhara Devi) తో సతీసమేతంగా బయలుదేరిన బాలయ్య దుబాయ్ లో కూడా కెమేరాల కంటబడ్డారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

రేపు అనగా జులై 6 గురువారం ఉదయం 9 గంటలకు న్యూ యార్క్ లోని ఎయిర్పోర్ట్ లో బాలయ్య కుటుంబం దిగనున్నారు. బాలకృష్ణ (Nandamuri Balakrishna) కార్యక్రమాన్ని సమన్వయపరుస్తున్న తానా బోర్డు సభ్యులు జానీ నిమ్మలపూడి ఆధ్వర్యంలో నందమూరి అభిమానులు, తానా నాయకులు ఘనంగా స్వాగతం పలకనున్నారు.

నందమూరి తారక రామారావు (NTR) శతవసంతోత్సవ సమయంలో జరుగుతున్న ఈ తానా మహాసభలకు నందమూరి బాలకృష్ణ (NBK) రావడం ఎన్టీఆర్‌ అభిమానులను మరింతగా సంతోషపెడుతోందని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్ రవి పొట్లూరి, ఛైర్మన్ శ్రీనివాస్ లావు అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected