Connect with us

Sports

Qatar: తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు విజయవంతం

Published

on

ఖతార్ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samithi) ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రీయ క్రీడ అయిన కబడ్డీ (Kabaddi) పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీల్లో ఖతార్ (Qatar) లో నివసిస్తున్న వందకు పైగా తెలుగు (Telugu) కార్మికులు పాల్గొన్నారు.

చివరకు జనసేన వారియర్స్ మరియు విజేత వారియర్స్ జట్లు ఫైనల్లో పోటాపోటీగా తలపడగా విజేత వారియర్స్ జట్టు ఛాంపియన్ గా గెలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎ సి బి ఎఫ్ తెలుగు రాష్ట్రాల రిప్రజెంటివ్ శ్రీ సుందరగిరి శంకర్ గౌడ్ గారు విచ్చేశారు.

శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ… స్పోర్ట్స్ డే సందర్భంగా మన రాష్ట్ర క్రీడను నేటి యువతకు ప్రోత్సహిస్తున్నందుకు అభినందించారు. అనంతరం తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షులు శ్రీ మైదం మధుగారు మాట్లాడుతూ… గల్ఫ్ సమితి సేవా కార్యక్రమాలు కాకుండా సాంస్కృతిక క్రీడ కార్యక్రమంలో కూడా ముందుంటుందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి ఉపాధ్యక్షులు గడ్డి రాజుగారు, ప్రధాన కార్యదర్శి సహగిరి వంశి గారు, మెంబర్షిప్ సెక్రటరీ గోలి శ్రీనివాస్ గారు, ఇన్సూరెన్స్ సెక్రటరీ సాగర్ గారు, వెల్ఫేర్ సెక్రెటరీ మనోహర్ చెవుల మధ్య గారు, మీడియా మరియు పిఆర్ఓ సెక్రెటరీ సంజీవ్ గారు, మరియు అడ్వైజర్ మెంబర్స్ తాళ్లపల్లి ఎల్లయ్య గారు, వేములవాడ ఎల్లన్న గారు పాల్గొని విజయవంతం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected