Connect with us

Associations

అట్లాంటా వాసుల గురించి కారుకూతలు కూసిన నరేన్ కొడాలి ప్యానెల్. క్షమాపణ చెప్పాలంటున్న అట్లాంటా తెలుగు యువత.

Published

on

తానా ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ప్రస్తుత తానా ఫౌండేషన్ ట్రస్టీ చేసిన వాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అట్లాంటా వాళ్ళు అమ్ముడుపోయారు భయపడ్డారా, అట్లాంటా అమ్ముడుపోయింది లొంగిపోయారా అంటూ ద్వందార్ధాలు వచ్చేలా ఎన్నో నోటిదురుసు వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పధకం ప్రకారం స్లిప్ ఇచ్చి మరీ స్టేజి ఎక్కించి  తిట్టించిన నరేన్ కొడాలి ప్యానెల్ అట్లాంటా వాసుల మీద విషం కక్కడం సమంజసమేనా! అందునా తానాలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఆ వ్యక్తి ఆలా దూషించడం పద్ధతేనా! అలాగే అట్లాంటాలో ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ సభని ఏర్పాటు చేసిన స్థానిక అట్లాంటా నాయకులు అడ్డుచెప్పకుండా చోద్యం చూస్తూ ఉండిపోవడం మరింత దారుణం, కొంచెం కూడా స్వాభిమానం లేకపోవడం సిగ్గుచేటు కాదా!

నరేన్ కొడాలి ప్యానెల్ ని సపోర్ట్ చేస్తూ ఎక్కడో డెట్రాయిట్ నుంచి వచ్చి అట్లాంటాలో అందునా అట్లాంటా తెలుగువారి గురించి హేళనగా చులకన భావంతో మాట్లాడడం అట్లాంటా సగటు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన అట్లాంటా తెలుగు యువత ఆ తానా ఫౌండేషన్ ట్రస్టీ లేదా నరేన్ కొడాలి ప్యానెల్ పరుష వాఖ్యలను వెంటనే వెనక్కుతీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ సర్వసాధారణం అని, అందులో భాగంగా లావు బ్రదర్స్ తో నరేన్ కొడాలి ప్యానెల్ కి పడకపోతే అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలని, అంతేకాని బరితెగించి అట్లాంటా తెలుగు వారందరినీ కలిపి నోటికొచ్చినట్టు తూలనాడితే మేము కూడా అదే రీతిలో స్పందిస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని ప్రశ్నించారు. మా మనోభావాలను దెబ్బతీసిన నరేన్ కొడాలి ప్యానెల్ కి వ్యతిరేకంగా నిరంజన్ శృంగవరపు ప్యానెల్ కి వోట్ వేసి బుద్ధి చెబుతామన్నారు. అట్లాంటానే కాదు తానా కూడా సేల్ కి లేదని, అందుకే ప్రజాస్వామ్య పద్దతిలో ఎలక్షన్స్ వచ్చాయని అన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected