Connect with us

Health

నెహ్రూ కఠారు ఆధ్వర్యంలో తానా ఉచిత కంటి వైద్య శిబిరం: గంపలగూడెం, కృష్ణా జిల్లా

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా న్యూయార్క్ లోని తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నెహ్రూ కఠారు సమర్పణలో కృష్ణా జిల్లా గంపలగూడెం గ్రామంలో మరో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదకాకాని లోని శంకర్ కంటి వైద్యశాలతో సంయుక్తంగా ఈ శిబిరాన్ని మార్చి 13న నిర్వహించారు.

స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఈ శిబిరానికి సుమారు 200 మంది గ్రామవాసులు తరలి వచ్చారు. అందరికి వైద్య పరీక్షలు నిర్వహించగా వీరిలో 90 మందికి కేటరాక్ట్ ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. ఈ 90 మందికి గుంటూరు నగరంలోని శంకర కంటి వైద్యశాలలో ఉచితంగా ఆపరేషన్ చేస్తారని నిర్వాహకులు తెలిపారు.

Nehru Kotaru

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ ట్రస్టీస్ & ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ సుమంత్ రాంశెట్టి మరియు పురుషోత్తమ చౌదరి గుడే సహకారంతో శిబిరాన్ని సమన్వయపరిచారు. ఈ ఉచిత కంటివైద్య శిబిరానికి మంచి స్పందన రావడంతో అందరూ స్పాన్సర్ నెహ్రూ కఠారు ని అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected