Connect with us

Associations

కన్నుల పండుగగా కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ ఉగాది వేడుకలు

Published

on

మార్చ్ 31న కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ ‘కాట్స్’ ఉగాది మరియు శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. యాష్బర్న్ లోని స్థానిక బ్రాడ్ రన్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈవేడుకలకు వెయ్యిమందికి పైగా పాల్గొన్నారు. ఈవేడుకలలో భాగంగా నిర్వహించిన చదరంగం, షార్ట్ ఫిలిం, టేబుల్ టెన్నిస్, డిబేట్ తదితర పోటీలలో సుమారు 250 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. వీటితోబాటు పంచాంగ శ్రవణం, శాస్త్రీయ, జానపద, సినీ సాంస్కృతిక కార్యక్రమాలు, ఫాషన్ షో హైలైట్ గా నిలిచాయి. ఇక గాయకులు కిరణ్ మరియు మానస తమ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇంత చక్కని కార్యక్రమాన్ని తెలుగు కమ్యూనిటీకందించిన రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం కాట్స్ కార్యవర్గాన్ని అందరూ అభినందించారు.