Connect with us

Concert

తాజా వారి దీపావళి ధమాకా; కాప్రీషియో బ్యాండ్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్

Published

on

ఫ్లోరిడాలోని జాక్సన్విల్ తెలుగు సంఘం (Telugu Association of Jacksonville Area) ‘తాజా’ వారు అక్టోబర్ 28 శుక్రవారం సాయంత్రం 6:30 నుండి కాప్రీషియో బ్యాండ్ వారితో లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ కోసం ప్రత్యేక నిధుల సమీకరణలో భాగంగా ఈ చారిటీ ఈవెంట్ తో ముందుకు వచ్చారు జాక్సన్విల్ తెలుగు సంఘం వారు.

కాప్రీషియో (Capricio) బ్యాండ్ గురించి తెలియని వారు ఉండరు. ముందు హైదరాబాద్ (Hyderabad) లో నంబర్ వన్ బ్యాండ్ గా పేరు తెచ్చుకొని ఇప్పుడు అమెరికా టూర్లో ఉన్నారు. వీరికి జతగా ప్రముఖ గాయనీగాయకులు సుమంగళి, మౌనిమ, శ్రీకాంత్ మరియు యాంకర్ సాహిత్య మిమ్మల్ని అలరించనున్నారు.

సురేష్ మిట్టపల్లి అధ్యక్షతన తాజా వారి దీపావళి ధమాకా 2022 లో భాగంగా నిర్వహిస్తున్న ఈ మెగా కార్యమ్రనికి జాక్సన్విల్ లోని లజారా పెర్ఫార్మెన్స్ హాల్ (Lazzara Performance Hall) వేదిక కానుంది. టికెట్స్ కొరకు www.NRI2NRI.com/TAJACapricioDiwaliConcert ని సందర్శించండి. స్పాన్సర్షిప్స్, గ్రూప్ డిస్కౌంట్స్, సీటింగ్ తదితర వివరాలకు ఫ్లయర్ లో ఉన్న నిర్వాహకులను సంప్రదించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected