Connect with us

News

Lifetime Achievement Awards: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రకటన

Published

on

2023 కి గాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డుల్ని ప్రకటించారు. కమిటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్, జి.వి.డి.కృష్ణమోహన్‌తో పాటు ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి, వివిధ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు సభ్యులుగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాలనుంచి లబ్ధ ప్రతిష్ఠుల్ని, దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులకు కమిటీ మూడేళ్ళుగా ఎంపిక చేస్తోంది. తమకు తాముగా దరఖాస్తు చేసుకున్న వారిని, జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా యంత్రాంగం ద్వారా ఎంపిక చేసిన నామినేషన్లను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తరవాత ఈ ఎంపిక చేయటం జరిగింది.

ఈ ఏడాది 27 అవార్డుల్ని సిఫారసు చేసి, ముఖ్యమంత్రి (YS Jagan Mohan Reddy) ఆమోదం మేరకు కమిటీ ఈ ప్రకటన చేస్తోంది. ఈ రోజు ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైయస్సార్‌ (YSR) అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు, 4 ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ఉన్నాయి.

2023 లో అవార్డులకు ఎంపిక అయిన వారి జాబితా

వ్యవసాయం:
1) శ్రీమతి పంగి వినీత – (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
2) శ్రీ వై.వి.మల్లారెడ్డి – అనంతపురం

ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌:
1) శ్రీ యడ్ల గోపాలరావు – రంగస్థల కళాకారుడు – శ్రీకాకుళం
2) శ్రీ తలిసెట్టి మోహన్‌ – కలంకారీ– తిరుపతి
3) శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి – హరికథ – బాపట్ల
4) శ్రీ కోన సన్యాసి – తప్పెటగుళ్ళు – శ్రీకాకుళం జిల్లా
5) ఉప్పాడ హ్యాండ్‌ లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ – కాకినాడ
6) శ్రీ ఎస్‌.వి.రామారావు – చిత్రకారుడు – కృష్ణా
7) శ్రీమతి రావు బాల సరస్వతి – నేపథ్య గాయని – నెల్లూరు
8) శ్రీ తల్లావఝుల శివాజీ – చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు – ప్రకాశం
9) శ్రీ చింగిచెర్ల కృష్ణారెడ్డి – జానపద కళలు – అనంతపురం
10) శ్రీమతి కలీసాహెబీ మహబూబ్‌ – షేక్‌ మహబూబ్‌ సుబానీ దంపతులకు – నాదస్వరం – ప్రకాశం

తెలుగు భాష, సాహిత్యం:
1) శ్రీ ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మం – పశ్చిమ గోదావరి
2) శ్రీ ఖదీర్‌ బాబు – నెల్లూరు – (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
3) శ్రీమతి మహెజబీన్‌ – నెల్లూరు (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు – చిత్తూరు
5) అట్టాడ అప్పలనాయుడు – శ్రీకాకుళం

క్రీడలు:
1) శ్రీ పుల్లెల గోపీచంద్‌ – గుంటూరు
2) శ్రీమతి కరణం మల్లీశ్వరి – శ్రీకాకుళం

వైద్యం:
1) శ్రీ ఇండ్ల రామ సుబ్బారెడ్డి – మానసిక వైద్యం – ఎన్టీఆర్‌
2) ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి – ఈఎన్‌టీ – కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ – వైయస్సార్‌

మీడియా:
1) శ్రీ గోవిందరాజు చక్రధర్‌ – కృష్ణా
2) శ్రీ హెచ్చార్కే – కర్నూలు

సమాజ సేవ:
1) శ్రీ బెజవాడ విల్సన్‌ – ఎన్టీఆర్‌
2) శ్రీ శ్యాం మోహన్‌– అంబేద్కర్‌ కోనసీమ – ఎచీవ్‌మెంట్‌ అవార్డు
3) నిర్మల హృదయ్‌ భవన్‌ – ఎన్టీఆర్‌
4 శ్రీ జి. సమరం – ఎన్టీఆర్

– జి.వి.డి.కృష్ణమోహన్, కమ్యూనికేషన్స్‌ ఎడ్వైజర్‌.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected