Connect with us

Cultural

ఏప్రిల్ 16న జాక్సన్విల్ తెలుగు సంఘం ‘తాజా’ ద్విశ‌తాబ్ది ఉగాది వేడుక‌లు

Published

on

తెలుగు అసోసియేష‌న్ ఆఫ్ జాక్స‌న్విల్ ఏరియా ‘తాజా’ ద్విశ‌తాబ్ది ఉగాది వేడుక‌లు వచ్చే నెల ఏప్రిల్ 16 శనివారం రోజున జరగనున్నాయి. ఆరంజ్ పార్క్ నగరంలోని త్రాషెర్ హార్న్ సెంటర్లో మధ్యాహ్నం 12 గంటల నుండి రోజంతా నిర్వహించే ఈ వేడుకలకు సురేష్ మిట్టపల్లి అధ్యక్షతన ఏర్పాట్లు చేస్తున్నారు. లంచ్, డిన్నర్, తేనీరు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాఫుల్ బహుమతులు ఇలా మరెన్నో కార్యక్రమాలతో రోజంతా సందడిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

జాక్సన్విల్ తెలుగు సంఘం ‘తాజా’ 20వ వసంతంలోకి అడుగెట్టిన వేళ శ్రీ శుభకృతు నామ సంవ‌త్స‌ర ఉగాది పండుగ‌ వేడుక‌లలో పాల్గొని తమ ఆత్మీయ ఆతిథ్యాన్ని అందుకోవలసిందిగా ‘తాజా’ కార్యవర్గ సభ్యులు కోరుతున్నారు. మరిన్ని వివరాలకు ఫ్లయర్ చూడండి.

error: NRI2NRI.COM copyright content is protected