Connect with us

News

వెన్సాయి టెక్నాలజీస్‌ & సంక్రాంతి రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్ నిమ్మగడ్డ కు Outstanding Georgia Citizen పురస్కారం

Published

on

Atlanta, Georgia, November 12, 2026: సంక్రాంతి ఇండియన్ కిచెన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ నిమ్మగడ్డ (నిమ్స్) కు జార్జియా రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన ‘అవుట్‌స్టాండింగ్ జార్జియా సిటిజన్’ (Outstanding Georgia Citizen) గౌరవం లభించింది. జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ (Secretary of State) రాఫెన్స్‌పర్జర్ (Brad Raffensperger) రాష్ట్ర క్యాపిటల్‌లో ఆయనకు ఈ గుర్తింపు పత్రాన్ని అందజేశారు.

అమెరికాతో పాటు అంతర్జాతీయ స్థాయిలో జార్జియా రాష్ట్రానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆయన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నిమ్మగడ్డ (Srinivas Nimmagadda) మాట్లాడుతూ, ఈ గుర్తింపు తనకు ఎంతో ప్రత్యేకమైనదని, తన ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

2001లో కనెక్టికట్‌ (Connecticut) లోని తన ఇంటి బేస్‌మెంట్‌లో వెన్సాయ్ టెక్నాలజీస్‌ (Vensai Technologies) ను ప్రారంభించిన నిమ్మగడ్డ, అంచెలంచెలుగా దానిని భారత్ (India), దుబాయ్ (Dubai), ఖతార్‌ (Qatar) లలో కార్యాలయాలు కలిగిన అంతర్జాతీయ ఐటీ సంస్థగా అభివృద్ధి చేశారు.

అనంతరం 2018లో సంక్రాంతి ఇండియన్ కిచెన్‌ (Sankranti Indian Kitchen) ను ప్రారంభించి, అమెరికాలో అసలైన భారతీయ రుచులను వేగంగా, నాణ్యతతో అందించే రెస్టారెంట్ బ్రాండ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు శ్రీనివాస్ నిమ్మగడ్డ (Srinivas Nimmagadda).

మెక్సికన్ ఆహార రంగంలో చిపోట్లే, మెడిటరేనియన్ ఆహార రంగంలో కావా తరహాలో భారతీయ వంటకాలకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) బ్రాండ్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని నిమ్మగడ్డ తెలిపారు. తన తొలి సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినట్లుగానే, సంక్రాంతిని కూడా అమెరికా అంతటా విస్తరించాలన్నది తన ఆశయమని వెల్లడించారు.

భారతీయ వంటకాలను వేగంగా, స్థిరమైన నాణ్యతతో అందించేందుకు అవసరమైన కార్యకలాపాల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఐదేళ్లపాటు నిరంతర పరిశోధనలు, ప్రయోగాలు, పరీక్షలు నిర్వహించినట్లు సంక్రాంతి ఇండియన్ కిచెన్‌ (Sankranti Indian Kitchen) సంస్థ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం అట్లాంటా మిడ్‌టౌన్‌లో సంక్రాంతి ఇండియన్ కిచెన్ QSR విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. త్వరలో బక్‌హెడ్, డౌన్‌టౌన్ అట్లాంటా (Atlanta, Georgia) ప్రాంతాల్లో మరో రెండు కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అంతేకాకుండా, జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌ (Georgia World Congress Center) లో జరిగే పలు భారీ కార్యక్రమాల్లోనూ సంక్రాంతి తన ఆహార సేవలను అందిస్తోంది. ఈ వేసవిలో అట్లాంటాలో నిర్వహించిన FIFA ఫ్యాన్ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వేలాది మంది సందర్శకులకు భారతీయ వంటకాలను అందించడం సంస్థకు మరో ముఖ్యమైన గుర్తింపుగా నిలిచింది.

2027 నుంచి ఫ్రాంచైజీ విధానం ద్వారా జార్జియా పరిసర రాష్ట్రాలకు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించాలని సంక్రాంతి ఇండియన్ కిచెన్ ప్రణాళికలు రూపొందిస్తోంది. భారతీయ ఆహారానికి అమెరికాలో జాతీయ స్థాయి బ్రాండ్ గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో శ్రీనివాస్ నిమ్మగడ్డ (Srinivas Nimmagadda) సాగిస్తున్న ఈ ప్రయాణం తెలుగు పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

సంక్రాంతి ఇండియన్ కిచెన్‌ (Sankranti Indian Kitchen) సంస్థ కి సంబంధించి మరిన్ని వివరాలకు https://www.sankranti.com ని సందర్శించండి.