Connect with us

Festivals

Ashburn, Virginia: 1500+ తెలుగు ప్రజల సమక్షంలో వైభవంగా CATS దసరా, దీపావళి సంబరాలు

Published

on

Ashburn, Virginia: ఆర్ట్స్, సాంస్కృతిక, అమెరికా గడ్డపై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు, కళా వైభవానికి మన్నుగా నిలిచిచూపే లక్ష్యంతో క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (CATS) Virginia ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా, దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

నవంబర్ 1, 2026న వర్జీనియాలోని ఆష్‌బర్న్‌ (Ashburn) లో ఉన్న జాన్ చాంప్ మిడిల్ స్కూల్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు 1,500 మందికి పైగా తెలుగు ప్రజలు, కుటుంబ సభ్యులు, పిల్లలు, యువత, స్థానిక ప్రజలు సందడిగా హాజరయ్యారు. భారతీయ సంస్కృతి, అమెరికా దేశభక్తి, సంగీతం, నృత్యం, కళా ప్రదర్శనలు, కుటుంబ సమైక్యత కలగలిసిన ఈ వేడుకలు ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి.

మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ వేడుకల్లో చిన్నారులు, యువత, స్థానిక కళాకారులు ప్రదర్శించిన వివిధ నృత్య, సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, సంగీత కచేరీలు, రంగురంగుల ఫ్యాషన్ షో (Fashion Show) ప్రేక్షకులను కట్టిపడేశాయి.

ఈ వేడుకలకు అమెరికా కాంగ్రెస్ సభ్యులు శ్రీ సుహాస్ సుబ్రహ్మణ్యం (Congressman Suhas Subramanyam), వర్జీనియా రాష్ట్ర సెనేటర్ శ్రీ కన్నన్ శ్రీనివాసన్ (VA State Senator Kannan Srinivasan), డా.గీతలు, కౌంటీ సూపర్‌వైజర్‌లు, కౌంటీ అధికారులు ముఖ్య అతిథులుగా విచ్చేసి వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సుహాస్ సుబ్రహ్మణ్యం (Suhas Subramanyam) మరియు ఇతర ప్రముఖులు CATS కార్యకలాపాలను అభినందిస్తూ, తెలుగు సమాజానికి అందిస్తున్న సేవలు, సామాజిక భాగస్వామ్యం, భవిష్యత్ ఆకాంక్షలను గురించి అభిప్రాయాలను పంచుకున్నారు.

2026 సంవత్సరం అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవ సంవత్సరం (1776–2026) కావడంతో, అమెరికా నేలలో నివసిస్తున్న మరియు సేవలందిస్తున్న భారతీయ మూలాలను, నాయకత్వాన్ని (Leadership) ప్రత్యేకంగా గౌరవిస్తూ గౌరవించడంలో ఈ వేడుకలో మరో గొప్ప ఆకర్షణ నిలిచింది.

ఈ సందర్భంగా మరీ గొప్పగా అంకితభావంతో (Dedication) సేవలు అందించిన వ్యక్తులు, నాయకులు, వ్యాపారవేత్తలు, కళాకారులను CATS వారి సేవలకు ప్రత్యేక గౌరవాన్ని అందించింది. ఈ సందర్భంగా సెనేటర్ స్టేట్‌లెవల్ సన్మానాలు శ్రీ విశ్వాస్, మేజర్ రాచెల్ తుడీ, సెన్సస్ హరిక్ కౌన్సిల్, లెఫ్టినెంట్ కల్నల్ సుధా కోటిని, లెఫ్టినెంట్ కల్నల్ సతీష్ వడ్డీ, మన సుదీప్, హోస్ట్ సాండ్రా, గౌరవించిన వారిలో భాగంగా పలువురిని ప్రత్యేకంగా సన్మానించింది.

అమెరికా సమాజంలో, వృత్తుల అమెరికా రక్షణ రంగంలో అందించిన సేవలను గుర్తించి గౌరవించడమే లక్ష్యంగా CATS ఒక గొప్ప సామాజిక సందేశాన్ని అందించింది. ప్రధాన గాయకులు, కళాకారుల ప్రదర్శనలతో పాటు REVERBZ లైవ్ మ్యూజిక్ బ్యాండ్ అందించిన ప్రత్యేక సంగీత విభావరి (Musical Night) ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పాటలు, నృత్యాలు, సంగీతంతో వేడుకలు రాత్రంతా పండుగ వాతావరణంలో కొనసాగాయి.

వేదికపై ప్రదర్శించిన పాటలు, చిన్నారుల ప్రదర్శనలు, వయోజనుల ప్రదర్శనలు, లైవ్ డ్రా, ఆకర్షణీయమైన బహుమతులు, ఫుడ్ బూత్స్ సందర్శకులను విశేషంగా అలరించాయి. ఉత్కృష్ట ప్రతిభతో పాటు విచ్చేసిన అతిథులందరికీ (Guests) కాంప్లిమెంటరీ డిన్నర్ ఏర్పాటు చేయడం నిర్వాహకుల ఆతిథ్య భావనను నిదర్శనంగా నిలిచింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఒకే వేదికపై కలసి ఆనందంగా గడిపేలా అన్ని ఏర్పాట్లు చేయడంతో ఈ వేడుకలు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

ఈ సమావేశం విజయవంతం కావడంలో CATS అధ్యక్షులు శ్రీ సారా రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు సమన్వయంతో కృషి చేసి ఈ భారీ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారా రెడ్డి మాట్లాడుతూ, CATS కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు, తెలుగు ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి తమ నిరంతర కృషిని కొనసాగిస్తామని తెలిపారు. సంస్థ ద్వారా తెలుగు భాషాప్రేమికులు, సాంస్కృతికవేత్తలు, ప్రవాసి కుటుంబాలు, యువతీ యువకులు, వయోవృద్ధులందరికీ (Senior Citizens) బహుళ ప్రయోజనాలు, పరస్పర సహకారం, వాణిజ్య అవకాశాలను విస్తరించేందుకు బిల్డింగ్ నెట్‌వర్కింగ్ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ (Executive Committee) సభ్యులందరూ సమిష్టిగా కృషి చేస్తూ, వాలంటీర్ సహకారంతో కార్యక్రమంలోని వివిధ విభాగాలను సమర్థవంతంగా నిర్వహించారు. స్థానికులు, కళాకారులు, చిన్నారులు, పెద్దలు, వాలంటీర్లు అందించిన సహకారం ఈ వేడుకల విజయానికి ఎంతో దోహదపడింది. కాట్స్ ప్రతినిధులు మరియు సంస్థ సభ్యులందరూ తమ విలువైన సూచనలు, అనుభవం, మార్గదర్శకత్వంతో ఈ వేడుకల విజయానికి తోడ్పడ్డారు. అనుభవజ్ఞులైన మార్గదర్శకులు, ప్రముఖులు, కళాకారులు, వ్యాపారవేత్తలు, వాలంటీర్లు అందించిన సహకారం ఈ వేడుకల విజయానికి ఎంతో దోహదపడింది.

కాట్స్ ప్రతిష్టను మరింత పెంచుతూ సంస్థ ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రుల సంబరాలు, అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, ఉగాది వేడుకలు, సంక్రాంతి సంబరాలు, రథసప్తమి, ఇతర సాంస్కృతిక (Cultural) కార్యక్రమాలు, యువతకు ప్రత్యేక కార్యక్రమాలు, మహిళా దినోత్సవ వేడుకలు, సామాజిక సేవా కార్యక్రమాలు, వాలంటీర్ నెట్‌వర్కింగ్ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ వేడుకలో భాగంగా తెలుగు సమాజంతో పాటు ఇతర తెలుగు సంఘాలు, కమ్యూనిటీ సంస్థలకు చెందిన ప్రముఖులను కూడా కాట్స్ ప్రత్యేకంగా సత్కరించింది. ముఖ్యంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA), గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ప్రతినిధులు, ఇతర కమ్యూనిటీ ప్రముఖులను ఆహ్వానించి, వారి సేవలను గుర్తిస్తూ, వారి సేవలను ప్రశంసిస్తూ సన్మానించడం జరిగింది.

వేదికపై తెలుగు సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని చాటే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా (Special Attraction) నిలిచాయి. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగు ప్రజలు, కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశారు. వేడుకలను చక్కగా నిర్వహించిన నిర్వాహకులకు (Organisers) ప్రేక్షకుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.

error: NRI2NRI.COM copyright content is protected