Houston, Texas: ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) హ్యూస్టన్ చాప్టర్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (నార్త్ అమెరికా) శ్రీ శ్రీనివాస్ మిరియాల గారిని ఘనంగా సత్కరించారు. “Innovation – Invest in Andhra Pradesh” నినాదంతో నిర్వహించిన ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.
Andhra Pradesh Non-Resident Telugu Society (APNRT) సౌత్-వెస్ట్ కోఆర్డినేటర్ సాయి రాజ్ కొత్తమాసు, టెక్సాస్ స్టేట్ కోఆర్డినేటర్లు గోపాల్ గూడపాటి, రత్న ప్రసాద్ గుమ్మడి, రాజేష్ యాళ్ళబండి, హ్యూస్టన్ సిటీ కోఆర్డినేటర్ సురేష్ సత్తి ఈ కార్యక్రమాన్ని సమష్టిగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్: భారతదేశ ఆర్థిక శక్తికేంద్రంగా ఎదుగుతున్న రాష్ట్రం
కీలకోపన్యాసంలో శ్రీ మిరియాల గారు “AP is India’s Rising Economic Powerhouse” అంటూ రాష్ట్ర పురోగతిని సభికులకు వివరించారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి దోహదపడేలా రూపొందించిన ‘స్వర్ణాంధ్ర – 2047’ ప్రణాళికలను, రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలను, భవిష్యత్ అభివృద్ధి ఆకాంక్షలను సమగ్రంగా తెలియజేశారు.
నవ ఆంధ్రప్రదేశ్ పురోగతికి పునాదులైన తొమ్మిది స్తంభాలు (9 Pillars)
Policy Framework Amaravati Greenfield Capital Water Security Industrial Infrastructure Global Logistics Hub Green Energy & Fuel One Family – One Entrepreneur – One AI Future Ready Workforce Product Perfection
3S మోడల్: Speed (వేగం), Scale (విస్తృతి), Sustainability/Service (సుస్థిరత/సేవ). దీనికి తోడుగా డిజిటల్ గవర్నెన్స్, Policy Architecture, Institutional Facilitation, సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, Talent Pipeline, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించే విధానాన్ని వివరించారు.
ప్రాధాన్య రంగాలు – పెట్టుబడి అవకాశాలు
Andhra Pradesh Future Ready Industrial Policy Economic Corridors & Industrial Clusters Renewable Energy Data Center Revolution Semiconductor Ecosystem Green Hydrogen Valley Space and Drone Economy Quantum and Deep Tech Future Shipping Industry Pharma and Petrochemical Industry Rare Earth Minerals Economy Medical Tourism Industrial Parks and Policies
పాలనలో AI, జియోస్పేషియల్ సాంకేతికత
“Geospatial Intelligence for a Brighter Andhra Pradesh” ఇనీషియేటివ్కు మద్దతుగా, IST Smart Solutionsకు చెందిన శ్రీ వట్టెం నరేంద్ర బాబు గారు “AI Solutions for Brighter Tomorrow”, “AI and Data Solutions for Andhra Pradesh Government” అంశాలపై ప్రసంగించారు. పాలనను, ప్రజాసేవలను మరింత మెరుగుపరచడంలో సాంకేతికత పోషించగల పాత్రను ఆయన వివరించారు.
నిర్వాహకుల అభిప్రాయాలు
సాయి రాజ్ కొత్తమాసు: అమెరికాలోని ఎన్ఆర్ఐలు పెట్టుబడి అవకాశాలను (Investment opportunities) అన్వేషించడానికి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇరుపక్షాలకూ ప్రయోజనం చేకూర్చడానికి విచ్చేసిన శ్రీ మిరియాల గారికి సాదర స్వాగతం పలికారు. గోపాల్ గూడపాటి: శ్రీ మిరియాల గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా అంతటా ఉన్న ఎన్ఆర్ఐల బలాన్ని, ప్రాముఖ్యతను వివరించారు. రత్న ప్రసాద్ గుమ్మడి: పెట్టుబడి అవకాశాలను, స్వదేశంలో ఎన్ఆర్ఐలకు ఉన్న అవకాశాలను వివరించేందుకు హ్యూస్టన్ను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సురేష్ సత్తి: హ్యూస్టన్ నుండి ఆంధ్రప్రదేశ్ కోసం APNRT అందిస్తున్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. ప్రశ్నోత్తరాలు – భాగస్వామ్యంపై ఆసక్తి
సమావేశంలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభికులు చురుగ్గా పాల్గొన్నారు. నవ ఆంధ్రప్రదేశ్ (Adhrapradesh) నిర్మాణంలో తాము కూడా భాగస్వాములు కావాలన్న ఆసక్తిని శ్రీ మిరియాల గారికి తెలియజేశారు. చివరిగా APNRT కోఆర్డినేటర్ రాజేష్ యాళ్ళబండి గారు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, సభికులకు, వేదికను సమకూర్చిన ‘ఆయుర్వేద కిచెన్’ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.