Charlotte, North Carolina: అమెరికాలోని తెలుగు వారిని ఐక్యం చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. తాజాగా చార్లెట్ లో ఎంతో వైభవంగా నాట్స్ (NATS) చార్లెట్ సంబరాలు నిర్వహించింది. తెలుగు వారి ఐకమత్యానికి, తెలుగు సాంస్కృతిక వైభవానికి ఈ నాట్స్ చార్లెట్ సంబరాలు 2026 ప్రతీకగా నిలిచాయి.
వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినా, భిన్న నేపథ్యాలు ఉన్న వారు.. మన తెలుగు వారి సంబరాలు అనే మమకారంతోఒక్కటై ఇంటి పండుగలాగా ఈ సంబరాలు జరుపుకున్నారు. తెలుగు సంఘాల (Telugu Associations) మధ్య ఉన్న సఖ్యత, సమైక్యత ఈ సంబరాల్లో కనిపించింది.
తానా, జీటీఈ, ఏపీటీఈ వంటి ప్రముఖ తెలుగు సంస్థల నాయకులు, ప్రతినిధులు ఎలాంటి బేధాభిప్రాయాలకు తావులేకుండా ఒకే వేదికపైకి వచ్చి ఈ వేడుకను విజయవంతం (Successful) చేశారు. అలాగే తెలుగు వారిని కలిపే ఈ సంబరానికైనా నేను ముందుంటానని నాట్స్ అధ్యక్షులు రాజ్ అల్లాడ (Raj Allada) తెలిపారు.
ఆయన ఈ వేడుకల్లో సతీసమేతంగా విచ్చేసి అందరితోనూ మమేకమవడం నాట్స్ చార్లెట్ విభాగానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఈ సంబరాలలో (Celebrations) చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమ సాంస్కృతిక ప్రతిభను చాటుకుంటూ తెలుగు వారిని కట్టపడేశారు.
శాస్త్రీయ సంగీతం, క్లాసికల్ డ్యాన్స్, ఫ్రీస్టైల్ నృత్యాలు కేవలం ప్రదర్శనలుగా కాకుండా మన సాంస్కృతిక వారసత్వాన్ని (Cultural Heritage) భావితరాలకు అందించే వారధులుగా నిలిచాయి. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘సైన్స్ ఫెస్ట్’ (Science Fest) చిన్నారులలో నూతన ఉత్సాహాన్ని నింపింది.
డ్రై ఐస్, ప్లాస్మా బాల్ వంటి తొమ్మిది రకాల ఆసక్తికరమైన ప్రయోగాలను (Interesting Experiments) చిన్నారులు ఎంతో ఆనందంగా తిలకించారు. చదువుతో పాటు వినోదాన్ని పంచుతూ సాగిన ఈ ప్రయోగాలు పిల్లల్లో సరికొత్త ఆలోచనలను రేకెత్తించాయి. ఈ సంబరాలకు ఏకంగా 800 మంది ముందుగానే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ఈ సంబరాల విజయానికి ఓ నిదర్శనం.
ఇది చార్లెట్ (Charlotte, North Carolina) తెలుగు సమాజంలో పెరిగిన ఐక్యతను, ఉత్సాహాన్ని స్పష్టంగా చాటిచెప్పింది. వేలాదిగా తరలివచ్చిన ప్రేక్షకులు, అంకితభావం (Dedication) తో పనిచేసిన వాలంటీర్లు, ప్రోత్సహించిన తల్లిదండ్రులు, సహకరించిన స్పాన్సర్లు అందరూ ఒకే కుటుంబంగా కలిసికట్టుగా శ్రమించడం వల్లే ఈ విజయం సాధ్యమైంది.
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, విజ్ఞానం అన్నీ కలగలిసిన ఈ నాట్స్ (North America Telugu Society – NATS) చార్లెట్ సంబరాలు 2026.. చార్లెట్ లో నివపించే తెలుగువారి గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మధుర జ్ఞాపకంగా, తెలుగువారి ఐకమత్యానికి ప్రతీకగా నిలిచాయి.
చార్లెట్ లో ఇంత గొప్పగా సంబరాలు నిర్వహించిన నాట్స్ చార్లెట్ విభాగం (NATS Charlotte Chapter) నాయకులు దీపిక తో పాటు మిగిలిన నాయకులందరినీ నాట్స్ చార్లెట్ అడ్వైజరీ సభ్యులు (Advisory Members) మూర్తి గులివిందల, నేషనల్ కోఆర్డినేటర్ వెంకట దగ్గుపాటి, పాస్ట్ చైర్మన్ మధు కొర్రపాటి (Madhu Korrapati) అభినందించారు.
జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పొనకాల, ఇండియా లయసన్ అరుణ్ శ్రీరామినేని, చాప్టర్ కోఆర్డినేటర్ దీపిక సయ్యపరాజు, జాయింట్ కోఆర్డినేటర్ పల్లవి అప్పని, ఈవెంట్స్ వినీల దొప్పలపూడి, వుమెన్ ఎంపవర్మెంట్ ప్రవీణ పాకలపాటి, ట్రెజరర్ లక్ష్మి బిజ్జల, స్పోర్ట్స్ సిద్ధార్థ చాగంటి, సోషల్ మీడియా సుమ జుజ్జూరు, కో చైర్ రూప మర్రి ల ఆర్ధ్వర్యం లో ఎంతో సమన్వయంతో (Coordination) జరిగిన ఈ తెలుగు సంబరాల ను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla) ప్రత్యేకంగా అభినందించారు.