Connect with us

News

NCAIA @ Aldie, Virginia: ఘనంగా భారత్–అమెరికా స్వాతంత్ర్య వేడుకలు, దేశభక్తి పరేడ్‌లో పాల్గొన్న ATA ప్రతినిధులు

Published

on

Aldie, Virginia: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం, అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏషియన్ ఇండియన్ అసోసియేషన్స్ (National Council of Asian India Associations – NCAIA) ఆధ్వర్యంలో ఆగస్టు 16న వర్జీనియాలోని ఆల్డీ పట్టణంలో ఘనంగా దేశభక్తి వేడుకలు నిర్వహించారు.

జాన్ ఛాంప్ హైస్కూల్ (John Champe High School)వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ–అమెరికన్ సమాజానికి చెందిన పలువురు ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, దేశభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక దేశభక్తి పరేడ్‌లో అమెరికా, భారత జాతీయ జెండాలను చేతబూని వివిధ సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అనంతరం జెండా ఆవిష్కరణ (Flag Hoisting) కార్యక్రమం నిర్వహించి, భారత్–అమెరికా స్నేహబంధాన్ని, రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న అనుబంధాన్ని ఘనంగా చాటిచెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association – ATA) తరఫున ప్రతినిధులు చురుకుగా పాల్గొన్నారు.

ATA ప్రతినిధులు జయంత్ చల్లా (Jayanth Challa) నాయకత్వంలో, ట్రస్టీ విష్ణు మాధవరం (Vishnu Madhavaram) మరియు కోఆర్డినేటర్ జీనత్ కుందూర్ (Zeenath Kumar Kundur) పాల్గొని ATA తరఫున తమ సంఘీభావాన్ని, దేశభక్తి భావాన్ని చాటారు. భారతదేశం మరియు అమెరికా స్వాతంత్ర్య వేడుకలను ఒకే వేదికపై జరుపుకోవడం ఎంతో ప్రత్యేకమైన సందర్భమని ATA ప్రతినిధులు పేర్కొన్నారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే అమెరికా సమాజంలో భారతీయ–అమెరికన్ల సేవా, సాంస్కృతిక పాత్రను మరింత బలోపేతం చేయడం అందరి బాధ్యత అని వారు అన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్న ATA సభ్యులు, నిర్వాహకులు, వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి జాతీయ ఐక్యత, దేశభక్తి, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

భారతదేశ (India) 80వ స్వాతంత్ర్య దినోత్సవం మరియు అమెరికా (United States of America) 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలు రెండు దేశాల మధ్య స్నేహం, పరస్పర గౌరవం, భారతీయ–అమెరికన్ సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. ఆటా తోపాటు పలు ఇతర సంస్థలు కూడా ఉత్సాహంగా ఈ పెరేడ్ లో పాల్గొన్నాయి.

error: NRI2NRI.COM copyright content is protected