Connect with us

Celebrations

అభిమానులు నడుమ ఘనంగా YS జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు @ Atlanta, Georgia

Published

on

Atlanta, Georgia, December 21: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Yeduguri Sandinti Jagan Mohan Reddy) పుట్టినరోజును పురస్కరించుకుని అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా నగరంలో హార్డ్‌కోర్ జగన్ అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఒకచోట చేరి కేక్ కట్ చేసి (Cake Cutting) సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అట్లాంటా (Atlanta, Georgia) కు చెందిన పలువురు జగన్ (YS Jagan) అభిమానులు పాల్గొన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసేవను, నాయకత్వాన్ని కొనియాడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

వేడుకల అనంతరం కేక్‌ను ఆస్వాదించిన అభిమానులు కలిసి భోజనం చేసి ఆనందంగా గడిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ జగన్‌మోహన్ రెడ్డి (Yeduguri Sandinti Jagan Mohan Reddy) పై తమ అభిమానాన్ని, ఐక్యతను ఈ కార్యక్రమం ద్వారా వారు చాటుకున్నారు.

ఈ పుట్టినరోజు వేడుకలు (Birthday Celebrations) అట్లాంటా (Atlanta, Georgia) లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, YSR కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపాయి.

error: NRI2NRI.COM copyright content is protected