California, San Francisco: యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, మానవ వనరులు మరియు ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్స్ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కి శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఎన్నారై టీడీపీ (NRI TDP) విభాగం అధ్యక్షులు జయరాం కోమటి (Jayaram Komati) నేతృత్వంలో బే ఏరియా కి చెందిన టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెట్టుబడులను ఆహ్వానించడానికి నారా లోకేష్ ఈ నెల 25వ తేదీ నుంచి వారం రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో గత ఐదేళ్ళుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పారిశ్రామిక రంగాన్ని సరైన గాడిలో పెట్టి ఉద్యోగావకాశాలు (Jobs) పెద్ద ఎత్తున కల్పించడం ఈ పర్యటన ముఖ్యోద్దేశం.
శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా (San Francisco, California) నుంచి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆనంతరం తమ ప్రియతమ యువనాయకుడిని విమానాశ్రయం నుండి ఆయన బస చేస్తున్న హోటల్ వరకు భారీ కార్ ర్యాలీ తో తోడ్కొని వెళ్ళారు.
ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎన్నారై టీడీపీ నాయకులు (NRI TDP Leaders) వెంకట్ కోగంటి, శ్రీనివాస్ తాడపనేని, విజయ్ గుమ్మడి, భక్తా బల్లా, శ్రీకాంత్ దొడ్డపనేని, ప్రసాద్ పైలా, కల్యాణ్ కోటా, శశి దొప్పలపూడి, సతీష్ అంబటి, వెంకట్ అడుసుమల్లి, హరి సన్నిధి, రవి అలేటి, భాస్కర్ అన్నే, విజయ్ సాగర్ రెడ్డి జెట్టి, రమేష్ మల్లారపు తదితరులు సమన్వయపరిచారు.