Connect with us

Festivals

వాసవి సేవా సంఘ్ దసరా & బతుకమ్మ సంబరాలు జయప్రదం @ Atlanta, Georgia

Published

on

Atlanta, Georgia: వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh) ఒక సేవా దృక్పధంతో స్థాపించిన సేవా సంస్థ. వీరు చేసే సేవలు బ్లాంకెట్స్ పంపిణి, ఫుడ్ ఫర్ హోంలోన్, అన్నదానాలు, పేద విద్యార్థులకు చేయూత, చెస్ క్రీడా కోచింగ్ లే కాకుండా ఈ మధ్య విజయవాడ (Vijayawada) ఫ్లడ్స్ సమయంలో పలువురికి సహాయ సహకారాలతోపాటు, మరెన్నో సేవా కార్యక్రమాలునిర్వహిస్తున్నారు.

అలాగే మన సంస్కృతిని అమెరికాలో ఎవరు మర్చి పోని విధంగా సంక్రాంతి, వాసవి జయంతి, మహిళా సాధికారిక దినోత్సవం, సమ్మర్ పిక్నిక్ తో పాటు బ్రాండ్ న్యూ దసరా మరియు బతుకమ్మ (Bathukamma) సంబరాలను ప్రారంభించి మన సంస్కృతి, సంప్రదాయాలను మనతో పాటుగా మన పిల్లలకు అందించాలని భావిస్తున్న అసలైన సేవా సంస్థ.

అక్టోబర్ 12, 2024 న జరిగిన దసరా (Dussehra) మరియు బతుకమ్మ సంబరాలలో భాగంగా కుంకుమ పూజ, బతుకమ్మ పోటీలు, కోలాటం, జానపద పల్లె పాటలు మరియు సినిమా నేపధ్య సంగీతం ప్రఖ్యాత కళాకారులచే నిర్వహించ బడినది. వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh) కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని జయప్రదం చేశారు.

సుమారు 800 మంది పాల్గొన్న ఈ పండుగలో వందేమాతరం సాయి, సింగర్ మాధురి పాటిబండ (Madhuri Patibanda), జానపాద సింగర్ షాలిని మరియు దండేపల్లి శ్రీనివాస్ (Dandepally Srinivas) లు శ్రోతలను ఉర్రుతలూగించారు. మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తములో ముంత మసాలా వంటి ప్రత్యేక వంటకాలను అందించారు.

రుచికరమైన విందు భోజనముతోపాటు పిల్లలు మరియు పెద్దలు చేసిన నృత్యాలు, ఫ్యాషన్ షోలతో శ్రోతలకు అసలైన దసరా పండుగ దినాన అట్లాంటా (Atlanta) లో నిజమైన పండుగ వాతావరణం కనిపించింది. అలాగే రక రకాల వేండర్ స్టాల్ల్స్ లో కావాల్సిన వస్తువులు కూడా దొరికేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది.

error: NRI2NRI.COM copyright content is protected