Connect with us

Government

కాంతితో క్రాంతి కార్యక్రమానికి తరలివచ్చిన ఎన్నారైలు @ Detroit

Published

on

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఇచ్చిన పిలుపు మేరకు డెట్రాయిట్‌ (Detroit) లో ఉన్న ఎన్నారైలు కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబుకు మద్దతును తెలియజేశారు.

చలిని సైతం లెక్కచేయకుండా దాదాపు 150 మందికిపైగా ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఎన్నారై టీడిపి (NRI TDP) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు క్యాండిల్‌ లైట్లతో, సెల్‌ఫోన్‌ లైట్లతో పాల్గొని జగన్‌ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిరచారు.

మేము సైతం బాబు కోసం, జగన్ (YS Jagan Mohan Reddy) ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి, చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) ని వెంటనే విడుదల చేయాలి వంటి నినాదాలు చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected