Connect with us

Politics

యువగళం @ 3000: 3 వేల ఆటోలతో మన్నవ మాస్ ర్యాలీ @ Guntur

Published

on

. నాడు 200 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన
. నేడు 3 వేల ఆటోలతో మాస్ ర్యాలీ
. పండుగలప్పుడు
చంద్రన్న కానుకల పంపిణీ
. ఆటంకాలున్నా సరే విజయవంతం
. కనీ వినీ ఎరుగని రీతిలో వైవిధ్య కార్యక్రమాలు
. గుంటూరు టీడీపీ క్యాడర్ లో జోష్ నింపుతున్న NRI మన్నవ మోహన కృష్ణ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం నాయకుడు మన్నవ మోహన కృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు (Guntur) నగరంలో 3 వేల ఆటోలతో భారీ ఆటో ర్యాలీని నిర్వహించారు.

గుంటూరు నగరంలో ఈ 3 వేల ఆటోల ర్యాలీని మన్నవ మోహన కృష్ణ జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ… లోకేష్ యువ గళం పాదయాత్ర దేశ రాజకీయాలలో సంచలనం అని కొనియాడారు.

టిడిపి (Telugu Desam Party) అధికారంలోకి రావడానికి యువ గళం యాత్రే పునాది అన్నారు. తెలుగుదేశం పార్టీ కి పూర్వ వైభావాన్ని, పునరుత్తెజాన్ని యువగళం తీసుకోచ్చింది అని మన్నవ మోహన కృష్ణ అన్నారు. లోకేష్ నాయకత్వ పటిమకు యువ గళం పాద యాత్రే నిదర్శనమన్నారు.

యువ గళం యాత్రకు వైసిపి ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పించినా యాత్రను దిగ్విజయంగా కొనసాగించిన లోకేష్, టిడిపి శ్రేణులు అభినందనీయులు అన్నారు. యువ గళం పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరులో 200 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన నిర్వహించామని, ఇప్పుడు 3000 కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్బంగా 3వేల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించామన్నారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తాము చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి, అలాగే పండుగ సందర్బంగా అందజేస్తామన్న చంద్రన్న కానుకలను ప్రభుత్వం అడ్డుకున్నా పార్టీ శ్రేణులు సమిష్టిగా నిలిచి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఆయన ప్రతి ఒక్కరికి మన్నవ మోహనకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

మరో 3 నెలలలో టిడిపి (Telugu Desam Party) అధికారంలోకి రావడం, ప్రజా రంజక పాలన అందించడం తద్యమన్నారు. ర్యాలీ అసాంతం చంద్రబాబు, లోకేష్ మద్దతుగా నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.

ఆటోల ర్యాలీలో టిడిపి (TDP) కి మద్దతుగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలు అలరించాయి. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ 3 వేల ఆటోల భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ మన్నవ మోహనకృష్ణ ధన్యవాదాలు తెలియచేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected