Connect with us

Competitions

ప్రతిభకు పట్టం కట్టే ధీం-తానా గ్రాండ్ కిక్ ఆఫ్ @ Atlanta, April 30

Published

on

తానా (TANA) 23వ మహాసభలు ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి (Ravi Potluri) కన్వీనర్ గా నిర్వహించనున్న విషయం తెలిసిందే.

తానా మహాసభలకు ముందు ధీం-తానా (DhimTANA) పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. 23వ తానా మహాసభలలో భాగంగా ఏప్రిల్ 30న అట్లాంటా (Atlanta) లో నిర్వహించే ప్రోగ్రాంతో ధీమ్ తానా పోటీలను గ్రాండ్ గా కిక్ ఆఫ్ చేయనున్నారు. ఆ తరువాత వరుసగా ప్రతి వారాంతం 18 నగరాల్లో నిర్వహించడానికి ప్రణాళిక రచించారు.

యువత ప్రతిభకు పట్టం కట్టే ఈ పోటీలను ధీం-తానా (DhimTANA) ఛైర్ మాలతి నాగభైరవ, కోఛైర్స్ శ్రీలక్ష్మి కులకర్ణి మరియు సోహిని అయినాలా, అలాగే కమిటీ సభ్యులు పూలని జాస్తి, పల్లవి దొప్పలపూడి, ఆర్తిక అన్నే, ప్రియాంక గడ్డం ముందుండి నడిపిస్తున్నారు.

ఎప్పటిలానే సింగింగ్, డాన్స్, మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా విభాగాలలో ఈ ధీమ్ తానా పోటీలను నిర్వహించనున్నారు. ఈసారి కొత్తగా చిలకా గోరింకా అంటూ కొత్తగా కపుల్ కాంటెస్ట్ విభాగాన్ని జతపరిచారు. అట్లాంటా ధీం-తానా పోటీలకు స్థానిక తెలుగు సంఘం ‘తామా (TAMA) కోహోస్టుగా వ్యవహరిస్తోంది.

అట్లాంటాలో నిర్వహించే ధీం-తానా పోటీలను స్థానిక దేశానా పాఠశాలలో సింగర్ రఘు కుంచె అతిథిగా, తానా సౌత్ఈస్ట్ రీజినల్ కోఆర్డినేటర్ వెంకట్ మీసాల (Venkat Meesala) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెజిస్ట్రేషన్స్ తదితర వివరాలకు www.NRI2NRI.com/DhimTANA ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected