నార్త్ కరోలినా రాష్ట్రం, క్యారీ నగరంలో (Cary, North Carolina) నిర్వహించిన ఏసియా ఫెస్ట్ (Asia Fest) 2026లో భాగంగా జరిగిన బోట్ రేస్‌లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America – TANA) రాలీ చాప్టర్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఏషియన్ ఫోకస్ ఆఫ్ నార్త్ కరోలినా (Asian Focus of North Carolina) ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ బోట్ రేస్‌లో TANA రాలీ చాప్టర్ గత ఎనిమిదేళ్లుగా పాల్గొంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటోంది. అలాగే చార్లెట్ డ్రాగన్ బోట్ అసోసియేషన్ (Charlotte Dragon Boat Association) ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఈ పోటీలో తానా రాలీ చాప్టర్ (TANA Raleigh Chapter) సభ్యులు ఉత్సాహంగా బరిలోకి దిగారు. టీమ్ సభ్యుల సమన్వయం, పోటీ స్ఫూర్తి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రతి ఏడాది నిర్వహించే ఈ కార్యక్రమాన్ని తానా టీమ్ స్క్వేర్ (TANA Team Square) కు అంకితం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
కమ్యూనిటీ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని తానా నాయకులు తెలిపారు. ఈ ఏడాది బోట్ రేస్ మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల (Suresh Kakarla, Udayagiri MLA) ఈ బోట్ రేస్ సంప్రదాయాన్ని ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించడం విశేషం.
అలాగే కమ్యూనిటీ సేవలకు ప్రతీకగా బోట్ రేస్ (Boat Race) ని తానా టీమ్ స్క్వేర్ (TANA Team Square) కు అంకితం చేయాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏసియా ఫెస్ట్‌లో పాల్గొనడం, అదే సమయంలో ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించడం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఈ ఏడాది ఏసియా ఫెస్ట్ బోట్ రేస్‌ను విజయవంతం చేయడంలో సహకరించిన తానా టీమ్ స్క్వేర్ చైర్ కిరణ్ కొత్తపల్లి, Fusion Nine (F9) మరియు Triangles Biryani Restaurants కు రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) నాయకత్వంలోని తానా నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే బోట్ రేస్‌లో పాల్గొన్న ట్రయాంగిల్ ఏరియా తెలుగు సంఘం (Triangle Area Telugu Association of North Carolina – TATA of NC) బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. TATA of NC అధ్యక్షుడు వినోద్ కాట్రగుంట (Vinodh Katragunta), నవీన్ చాపా, శ్రీకాంత్ ఉప్పలపాటి, మిథున్ సుంకర కార్యక్రమ నిర్వహణలో చురుకుగా పాల్గొని బృందాన్ని ముందుండి నడిపించారు.
ఏసియా ఫెస్ట్‌కు (Asia Fest) హాజరై తానా టీమ్‌ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కమ్యూనిటీ సేవ, ఐక్యత, సాంస్కృతిక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ బోట్ రేస్ సంప్రదాయాన్ని భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని తానా (TANA)ప్రతినిధులు తెలిపారు.