Connect with us

Events

ప్రప్రథమంగా చికాగోలో పెద్దఎత్తున ‘తానా’ మహిళా దినోత్సవ వేడుకలు

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరిగా ‘తానా’ మహిళా దినోత్సవ వేడుకలను చికాగోలో మార్చి 12వ తేదీ ఆదివారం రోజున అత్యంత వైభవంగా నిర్వహించారు. తానా మహిళా సర్వీసెస్ కోఆర్డినేటర్ డా. ఉమా ఆరమండ్ల కటికి ఆధ్వర్యంలో మిడ్ వెస్ట్ లో ప్రప్రథమంగా ‘తానా’ మహిళా దినోత్సవ వేడుకలు జరగడం ఎంతో శుభపరిణామం.

ఈ వేడుకల్లో ‘తానా’ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకర్తి, ‘తానా’ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ, ‘తానా’ ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తం చౌదరి గుడే, ‘తానా’ మీడియా చైర్ ఠాగూర్ మలినేని, ‘తానా’ రీజినల్ రిప్రజెంటేటివ్, సౌత్ యూనిట్ కిషోర్ యార్లగడ్డ మరియు కమిటీ సభ్యులు అందరూ, నేషనల్ కో చైర్స్, వెంకట్ బిత్రా, రామకృష్ణ కృష్ణస్వామి, ఫణి వేగుంట తదితరులు హాజరయ్యారు. చికాగో లోకల్ లీడర్స్ హేమ కానూరు, యుగందర్ యడ్లపాటి, కృష్ణ మోహన్, రజినీ ఆకురాతి తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ కౌన్సిల్ జనరల్ అమిత్ కుమార్ మరియు సురభి కుమార్, అదే విధంగా కాంగ్రెస్ మ్యాన్ రాజా కృష్ణమూర్తి, స్టేట్ సెనెటర్ రామ్ విల్లివాలమ్ హాజరయ్యి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం గొప్పగా విజయవంతం కావాలని తమ అమూల్యమైన ఆశీస్సులు అందించారు.

ఈ బృహత్ కార్యక్రమంలో డా. ఉమా ఆరమండ్ల కటికి చికాగోలో పేరెన్నికిగన్న పదవులలో ఉన్న మహిళా లీడర్స్ ను శాలువాతో సన్మానించారు. అలాగే అనాధ భాలికల స్థితిగతులు మెరుగు పరిచి, వారి భవిష్యత్తు బంగారు బాటకు ఊపిరి అద్దడానికి ‘తానా’ ఫౌండేషన్ ప్రోగ్రాం ‘చేయూత’ కి 1700 డాలర్లను సైతం సేకరించారు. దీనివల్ల ఎందరో అనాథ బాలికలకు అపూర్వమైన, అద్భుతమైన చేయూత దొరికినట్టు అయ్యింది.

సన్మానం అనంతరం మహిళలు అందరూ అదే వేదిక పై గ్లామర్ ర్యాంప్ వాక్ లతో ఆ సాయంత్రాన్ని ఆనందంగా గడిపారు. క్రియేటివ్ ఐడియాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫ్యాషన్ షో అందరినీ అమితంగా ఆకర్షించింది. తర్వాత డాన్స్ ఫ్లోర్ ఓపెన్ కావడంతో మహిళలు ఉత్సాహంగా డ్యాన్సులు వేసి సంతోషించారు. ప్రణతి త్రిపుర యాంకరింగ్ ఈ వేడుకలో అందరినీ ఆకర్షించింది.

ఈ కార్యక్రమం కోసం తమ సేవలందించి తనకు సహకరించిన వారికి డా. ఉమా ఆరమండ్ల కటికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా హేమ అద్దంకి, ప్రణతి, శాంతి లక్కంసని, శ్రీలత గరికపాటి, సంధ్య అద్దంకి, అనిత కాట్రగడ్డ, శ్రీదేవి దొంతి, కిరణ్ వంకాయపాటి, గురు స్వామి లకు డా. ఉమా ఆరమండ్ల కటికి ప్రత్యేక థ్యాంక్స్ చెప్పారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected