Connect with us

Associations

మార్చి 26న వెటా మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు: Women Empowerment Telugu Association

Published

on

ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు మార్చి 26న ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఆన్లైన్లో నిర్వ‌హించ‌నున్న ఈ వేడుక‌లలో రెట్రో స్టైల్‌, ఫుడ్ కార్వింగ్, నృత్య ప్రదర్శనలు, ట్రివియా గేమ్స్‌, ష్యాష‌న్ షో తదితర కార్య‌క్ర‌మాలు ఆకట్టుకోనున్నాయి. ఈ పోటీల‌లో పాల్గొనాల‌నుకునేవారు మార్చి 20వ తేదీలోగా త‌మ వివ‌రాల‌ను క్యూఆర్ కోడ్ లింక్ ద్వారా న‌మోదు చేసుకోవాలి. విజేత‌ల‌కు ప్రముఖుల చేత అవార్డులు అందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేక‌తోటి సుచ‌రిత ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ‌, ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ ప్రత్యేక అతిధులుగా హాజ‌రుకానున్నారు. అలాగే ఇంట‌ర్నేష‌న‌ల్ టేబుల్ టెన్నిస్ ప్లేయ‌ర్ నైనా జైస్వాల్‌, ఇమ్మిగ్రేషన్ అటార్నీ ప్ర‌శాంతి రెడ్డి, ప్ర‌ముఖ న‌వ‌లా ర‌చ‌యిత‌ బాలభ‌ద్ర‌పాత్రుని ర‌మ‌ణి, కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ అంబ‌టి శ్రీ‌వాణి ప్రసంగించనున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected