Connect with us

Movies

తెలుగు సినీ నటుడు ‘బాబాయ్’ రాజబాబు మరణం

Published

on

తెలుగు సినీ నటుడు రాజబాబు నిన్న ఆదివారం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యతో వున్న రాజబాబు వయసు 64 ఏళ్ళు. రాజబాబుకు భార్య, ముగ్గురు పిల్లలు వున్నారు. అందరినీ హాయిగా నవ్విస్తూ వుండే రాజబాబు మరణించారన్న వార్త సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. రాజబాబు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేటలో జూన్ 13, 1957లో జన్మించారు. రాజబాబు మొట్టమొదటి సినిమా 1995లో వచ్చిన ఊరికి మొనగాడు. సుమారు 62 చిత్రాల్లో, 48 సీరియల్స్ లో నటించి అందరినీ మెప్పించారు. 2005 లో అమ్మ సీరియల్ లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది. రాజబాబును అందరూ బాబాయ్ అని పిలుస్తారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected