Connect with us

Sports

తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఇండియానా క్రీడా కార్యక్రమాల షెడ్యూల్

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఇండియానా ఆగష్టు 28 ఆదివారం రోజున నోబుల్స్విల్ నగరంలోని ఫారెస్ట్ పార్క్ ఇన్ లో వనభోజనాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే వచ్చే నెల సెప్టెంబర్ లో పలు దఫాలుగా వివిధ క్రీడా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఇండియానా అధ్యక్షులు మార్ రెడ్డి దొండేటి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11న టెన్నికాయిట్, త్రోబాల్, చెస్ నిర్వహిస్తున్నారు. అనంతరం సెప్టెంబర్ 17న టెన్నిస్, సెప్టెంబర్ 18న వాలీబాల్, సెప్టెంబర్ 25న బాడ్మింటన్ నిర్వహించేలా ప్రణాళిక చేశారు.

ఈ క్రీడా కార్యక్రమాలకు స్పాన్సర్స్ గా చంద్ర ఆలోకం, సుకేష్ ఓరుగంటి, బెస్ట్ బ్రైన్స్, సాయి వంకాయల, టెంపరేచర్ ప్రో సాయి సంక వ్యవహరిస్తున్నారు. రెజిస్ట్రేషన్ తదితర వివరాలకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఇండియానా వెబ్సైట్ ని సంప్రదించండి.

error: NRI2NRI.COM copyright content is protected